రెండో పెళ్లి చేసుకున్న నాటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది సింగర్ సునీత. ఉన్నట్లుండి నెల రోజుల్లోనే నిశ్చితార్థం, పెళ్లి రెండూ పూర్తి చేసింది సునీత. తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనితో ఏడడుగులు నడిచింది. జనవరి 9న ఈ ఇద్దరి పెళ్లి శంషాబాద్ శివార్లలో ఉన్న రామాలయంలో ఘనంగా జరిగింది. చాలా మంది ప్రముఖులు కూడా సునీత పెళ్లికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈమె రెండో పెళ్లి గురించి.. రెండో భర్త గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మొదటి భర్త గురించి.. ఆయనెవరు.. ఏం చేస్తుంటాడు అనే విషయాలపై మాత్రం చాలా మందికి క్లారిటీ లేదు. అయితే సునీత మొదటి పెళ్లి కూడా చాలా నాటకీయంగా జరిగింది. సినిమా స్టైల్లోనే తొలిసారి ఏడడుగులు నడిచింది సునీత. నచ్చిన వాడి కోసం ఇంట్లో వాళ్లను కాదని మరీ పెళ్లి చేసుకుంది. అది కూడా కేవలం 19 ఏళ్ళ వయసులోనే. మళ్లీ వాళ్ల ప్రేమకు చిగురు తొడిగింది 17 ఏళ్ల ప్రాయంలోనే. సునీత తొలి వివాహం గురించి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని నిజాలు బయటికి వచ్చాయి. ఈమె మొదటి భర్త పేరు కిరణ్. ఆయన కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. సునీత గాయనిగా పరిచయం అయిన తర్వాత ఆమెకు ఇక్కడ కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. ఇదిలా ఉంటే ఈమెకు 17 ఏళ్ళున్నపుడే కిరణ్ ఐ లవ్ యూ చెప్పాడు. అయితే వెంటనే ఆమె ఒప్పుకోలేదు. దాదాపు ఏడాదిన్నర తిరిగిన తర్వాత ఓకే చెప్పింది. కానీ అప్పటికి కూడా ఆమె వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే.

సింగర్ సునీత (Singer Sunitha)
పైగా సునీత ప్రేమించిన వాడు ఈమె ఇంట్లో నచ్చలేదు కూడా. అయినా కూడా ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది సునీత. బయటికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. 19 ఏళ్ళ ప్రాయం అంటే కెరీర్ అప్పుడప్పుడే సెట్ చేసుకోవాల్సిన టైమ్. కానీ ఈమె మాత్రం పెళ్లి చేసుకుంది. అయితే తను ప్రేమించింది కూడా బ్రాహ్మణుల అబ్బాయినే కావడంతో కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాళ్లు కూడా ఓకే అన్నారని చెప్పింది సునీత. కొన్ని రోజుల వరకు మాత్రం మాట్లాడలేదని.. ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయని చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత అనుకోని అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయామని తెలిపింది సునీత.

సింగర్ సునీత (Singer Sunitha)
ఇప్పుడు తన పిల్లలు జ్ఞాపకాలు అని.. తమ పేరెంట్స్కు వాళ్లే లోకం అంటుంది ఈ సింగర్. ఇప్పుడు మీ గతం తలుచుకుంటే ఏమనిపిస్తుంది అంటే గతం గురించి పట్టించుకునే కంటే కూడా గతం తాలూకు అనుభవాలు మనకు జీవితంలో పనికొస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది సునీత. మనకు గతం గుణపాఠాలు నేర్పించాలని.. అనుభవం భవిష్యత్తు కోసం పనికొస్తే బాగుంటుందని వేదాంత ధోరణిలో మాట్లాడింది సునీత. ఏదేమైనా కూడా ఈమె మొదటి భర్త వివరాలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:January 23, 2021, 22:41 IST