• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • INTERESTING DETAILS ABOUT KARTHIKA DEEPAM VANTALAKKA DAUGHTER HIMA ORIGINAL NAME AND HER AGE PK

Karthika Deepam Hima: వంటలక్క కూతురు చిన్నారి హిమ బయట ఇంత అందంగా ఉంటుందా..?

కార్తీక దీపం ఫేమ్ హిమ (karthika deepam hima)

Karthika Deepam Hima: కార్తీక దీపం.. ఈ సీరియల్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు సీరియస్‌గా ఒక్కరు కూడా ఉండరేమో..? కనీసం ఇంటికి ఒక్కరైనా వంటలక్క ఫ్యాన్ ఉంటారు. అంతగా తెలుగు ప్రేక్షకుల లోగిళ్లలోకి ఈ సీరియల్ దూసుకెళ్లిపోయింది.

  • Share this:
కార్తీక దీపం.. ఈ సీరియల్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు సీరియస్‌గా ఒక్కరు కూడా ఉండరేమో..? కనీసం ఇంటికి ఒక్కరైనా వంటలక్క ఫ్యాన్ ఉంటారు. అంతగా తెలుగు ప్రేక్షకుల లోగిళ్లలోకి ఈ సీరియల్ దూసుకెళ్లిపోయింది. అందులో కారెక్టర్స్‌తోనే ప్రేమలో పడిపోయారు ఆడియన్స్. వంటలక్క, డాక్టర్ బాబు, హిమ, సౌందర్య, మోనిత.. ఇలా ప్రతీ ఒక్క పాత్ర కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకే ఏళ్లకేళ్లు ఈ సీరియల్ సాగుతున్నా.. సా...గుతున్నా కూడా అలాగే చూస్తున్నారు ఆడియన్స్. పైగా రేటింగ్ పరంగా వంటలక్క టాప్‌లో ఉంది. కనీసం దాని దరిదాపుల్లోకి కూడా మరో సీరియల్ రాదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సీరియల్‌లో నటించే నటులు కూడా అందరికీ పరిచయమే. ముఖ్యంగా వంటలక్క దీప కూతురు హిమ కూడా బాగానే పాపులర్ అయింది. ఈ చిన్నారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో. హిమ అసలు పేరు సహృద. ఈ బేబీ చిన్నప్పటి నుంచి సీరియల్స్ చేస్తూనే ఉంది. కార్తీక దీపం చాలా క్రేజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ సీరియల్‌లో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకరు హిమ అయితే.. మరొకరు శౌర్య. అందులో శౌర్య డాక్టర్ బాబు మాదిరే అందంగా ఉంటుంది.. కానీ హిమ మాత్రం వంటలక్కగా నల్లగా ఉంటుంది. ఇదే విషయం తనకు తెలిసి ముందు చాలా బాధ పడ్డానని చెప్తుంది హిమ.

karthika deepam serial latest episode hotstar,karthika deepam serial vantalakka,karthika deepam serial hima,karthika deepam serial hima original name sahruda,karthika deepam serial hima photos,karthika deepam serial hima eka baby sahruda,karthika deepam telugu serial,telugu cinema,karthika deepam serial hima age,కార్తీక దీపం,కార్తీక దీపం వంటలక్క కూతురు హిమ,కార్తీక దీపం హిమ ఒరిజినల్ నేమ్ సహృద,కార్తీక దీపం హిమ వయసు
కార్తీక దీపం ఫేమ్ హిమ (karthika deepam hima)


సీరియల్‌లో అవకాశం వచ్చినపుడు అందులో తనను అందంగా చూపించరని తెలిసాక చాలా బాధ పడిన విషయాన్ని చెప్పింది ఈ చిన్నారి. అలాగే ఈ సీరియల్ గురించి కొన్ని విషయాలు చెప్తూ మొదట్లో కెమెరా అంటే భయమని.. మేకప్ అంటే యిష్టమే ఉన్నా ఎందుకో మొదట్లో నచ్చలేదని చెప్పింది ఈ పాప. ఆ నలుపు మేకప్ చూసి భయపడేదాన్ని అని.. తనకు నచ్చకపోయినా కూడా సీరియల్‌ మేకర్స్‌కు ఇచ్చిన మాట కోసం చేసానని చెప్పింది చిన్నారి సహృద.

karthika deepam serial latest episode hotstar,karthika deepam serial vantalakka,karthika deepam serial hima,karthika deepam serial hima original name sahruda,karthika deepam serial hima photos,karthika deepam serial hima eka baby sahruda,karthika deepam telugu serial,telugu cinema,karthika deepam serial hima age,కార్తీక దీపం,కార్తీక దీపం వంటలక్క కూతురు హిమ,కార్తీక దీపం హిమ ఒరిజినల్ నేమ్ సహృద,కార్తీక దీపం హిమ వయసు
కార్తీక దీపం ఫేమ్ హిమ (karthika deepam hima)


కానీ రాను రాను తనకు ఆ పాత్ర ఎంతో నచ్చిందని.. సీరియల్ కథ కూడా ఎంతో బాగుందని కొన్ని విషయాలు తెలిపింది. హిమకు తన ఫస్ట్ లుక్ నచ్చకపోయినా కూడా కథ అర్థమయ్యాక అందులో లీనం అయిపోయింది. తనకు తన అమ్మ దీప వల్లే డీ గ్లామర్ రోల్ చూపిస్తున్నారని అర్థమైందని చెప్పింది హిమ. ఏదేమైనా ఈ సీరియల్ తర్వాత తనకు మరిన్ని అవకాశాలు కూడా వస్తాయని ఆశిస్తుంది సహృద.
Published by:Praveen Kumar Vadla
First published: