Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: March 20, 2019, 9:13 AM IST
సల్మాన్ ఖాన్,అలియా భట్
బాలీవుడ్లో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. అలాగే బీటౌన్‌లో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీది డిఫరెంట్ స్టైల్. ముఖ్యంగా చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో భన్సాలీకి తిరుగులేదని ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాలతో నిరూపించుకున్నాడు. మరోవైపు భన్సాలీ తెరకెక్కించిన చిత్రాల్లో చరిత్రను వక్రీకరించారని కొంత మంది వాదన. వాటి సంగతి పక్కన పెడితే వెండితెరపై ఆయన తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక్కో దృశ్యకావ్యంగా నిలిచిపోయాయి.పోయిన ఇయర్ పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ...తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సల్మాన్‌ఖాన్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమె 11 ఏళ్ల వయసులో ఉన్నపుడు భన్సాలీ ఆఫీస్‌లోకి అడుగుపెట్టింది. ఇపుడు హీరోయిన్గా ఆయన సినిమలో అది సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా నటించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేసింది అలియా భట్. ఈ సినిమాకు ‘ఇన్షా అల్లా’ అనే టైటిల్ పెట్టారు. ఇక భన్సాలీ, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా.
గతంలో వీళ్లిద్దరి కలయికలో ‘ఖామోషీ,‘హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘సావరియా’ సినిమాలు వచ్చాయి. సావరియాలో సల్మాన్ అతిథి పాత్రలో మెరిసాడు.
ఈసినిమాను 2020 రంజాన్ కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
First published:
March 20, 2019, 9:09 AM IST