రామ్ చరణ్‌ను ఆకాశానికి ఎత్తేసిన దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ ..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ప్రముఖ దిగ్గజ సాప్ట్‌వేర్ కంపెనీ ఓనర్ ఆకాశానికి ఎత్తేసింది. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: February 9, 2020, 9:34 PM IST
రామ్ చరణ్‌ను ఆకాశానికి ఎత్తేసిన దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ ..
రామ్ చరణ్ (Instagram/Ram Charan)
  • Share this:
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ప్రముఖ దిగ్గజ సాప్ట్‌వేర్ కంపెనీ ఓనర్ ఆకాశానికి ఎత్తేసింది. వివరాల్లోకి వెళితే.. చిరుత సినిమాతో మెగాస్టార్ నట వారసుడిగా టాలీవుడ్‌లో లెగ్ పెట్టిన రామ్ చరణ్.. ఆ తర్వాత తెలుగు అగ్ర కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. హీరోగా స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడిగా మాత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ ఎపుడైతే సుకుమార్ దర్శకత్వలో చేసిన ‘రంగస్థలం’ సినిమాతో హీరోగా రామ్ చరణ్‌లోని నటుడిని వెలికి తీసింది. ఈ చిత్రంలో రామ్ చరణ్.. నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. అంత అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు రామ్ చరణ్. తాజాగా రంగస్థలంలో రామ్ చరణ్ నటనను ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తి ప్రశంసించారు. దాంతో పాటు తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల తర్వాత తాను రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాను చూసినట్టు చెప్పారు. అందులో రామ్ చరణ్.. చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారని మెచ్చుకున్నారు.

infosys sudha narayana murthy praises ram charan acting in rangasthalam movie here are the details,ram charan,infosys,infosys sudha narayana murthy,rrr,jr ntr,infosys sudha narayana murthy praises ram charan,ram charan facebook,ram charan instagram,ram charan twitter.ram charan rangasthalam,rangasthalam,tollywood,telugu cinema,రామ్ చరణ్,రంగస్థలం,రామ్ చరణ్ రంగస్థలం,ఇన్ఫోసిస్ సుధా నారాయణ మూర్తి,ఇన్ఫోసిస్ సుధా మూర్తి రామ్ చరణ్,రామ్ చరణ్ నటన,ఆర్ఆర్ఆర్,ఎన్టీఆర్ సుధా నారాయణ మూర్తి,
రంగస్థలంలో రామ్ చరణ్ నటనను మెచ్చుకున్న సుధా మూర్తి (Twitter/Photo)


ఇక తన చిన్నతంలో ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు అంటే ఎంతో ఇష్టపడి చూసేదాన్ని అని  చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మాయా బజార్, దాన వీర శూర కర్ణ, సీతా రామ కళ్యాణం వంటి సినమాలంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. మనకు రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. కానీ ఎన్టీఆర్ ఆయా దేవుళ్ల పాత్రల్లో నటించి దేవుడంటే ఇలానే ఉంటాడనేలా చేసాడన్నారు.నా దృష్టిలో కృష్ణుడంటే ఎన్టీఆరే. ఎపుడైనా కళ్లు మూసుకొని కృష్ణుడిని స్మరిస్తే.. నాకు కనిపిస్తారు. అంతేకాదు కాకుండా.. తనకు అన్నమయ్య, ఓం నమో వేంకటేశాయా, భక్త ప్రహ్లాద చిత్రాలంటే కూడా ఇష్టమన్నారు. తాజాగా తన అభిమాన చిత్రాల్లో రంగస్థలం కూడా చేరిందన్నారు. అందులో రామ్ చరణ్ అద్భుతంగా ఒదిగిపోయిన తీరును వర్ణించారు. దాంతో పాటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన ‘మనం’ కూడా చూసినట్టు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలుగు చిత్రాలతో పాటు కన్నడ సినిమాలను కూడా ఎక్కువగా వీక్షిస్తానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
First published: February 9, 2020, 8:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading