హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu Mother Passes Away :సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతిపై చిరంజీవి సహా సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

Mahesh Babu Mother Passes Away :సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతిపై చిరంజీవి సహా సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

ఇందిరా దేవి మృతిపై చిరంజీవి సహా పలువురు ప్రముఖులు నివాళులు (Twitter/Photo)

ఇందిరా దేవి మృతిపై చిరంజీవి సహా పలువురు ప్రముఖులు నివాళులు (Twitter/Photo)

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ   భార్య .. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసారు. ఈమె మృతిపై చిరంజీవి సహా సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ   భార్య .. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసారు. ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన ఘటన మరవక ముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నమూయడం విషాదకరం.  ఆమె వయసు 70 యేళ్లు. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి,  మహేష్ బాబు తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇందిరా దేవి మృతిపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. శ్రీమతి ఇందిరా దేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త తనను ఎంతో కలిచివేసిందన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చూకూరాలని కోరుకుంటూ , సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేష్ బాబుకు , వాళ్ల కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.మరోవైపు జనసేనాని పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కూడా కృష్ణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.

  అటు ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ ఇందిరా దేవి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ సహా ఐదుగురు సంతానం. వీళ్లు కాకుండా మరో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నారు.

  కృష్ణ కుటుంబానికీ పవన్ కళ్యాణ్ నానుభూతి లేఖ (Twitter/Photo)

  గత కొంత కాలంగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరోవైపు పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఆమె కృంగి పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆమె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. అంతేకాదు అప్పట్లో కృష్ణ, విజయ నిర్మల పెళ్లికి ఈమె సహకరించారు.ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్టు మీడియాకు తెలిపారు.

  Dadasaheb Phalke Award for Asha Parekh: ఆషా పరేఖ్ సహా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ దిగ్గజాలు వీళ్లే..

  మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ.. మూడేళ్ల క్రితం రెండేళ్ల క్రితం విజయ నిర్మల కన్నుమూయం ఒక దెబ్బ అయితే.. ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం.. తాజాగా మొదటి భార్య.. ఇందిరా దేవి తుది శ్వాస విడవడం బాధాకరం. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ.. ఐదేళ్ల క్రితం విడుదలైన ‘శ్రీశ్రీ ’ మూవీ తర్వాత మరే సినిమాలో నటించలేదు. ఇంటి పట్టునే ఉంటున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Chiranjeevi, Mahesh Babu, Super Star Krishna, Tollywood

  ఉత్తమ కథలు