• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • INDIAS POPULAR BHAJAN SINGER NARENDRA CHANCHAL PASSES AWAY AT 80 NARENDRA MODI REACTS SK

Narendra Chanchal: ప్రముఖ గాయకుడు మృతి.. ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి

Narendra Chanchal: ప్రముఖ గాయకుడు మృతి.. ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి

నరేంద్ర చంచల్, ప్రధాని నరేంద్ర మోదీ

RIP Narendra Chanchal: నరేంద్ర చంచల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని ప్రధాని ట్వీట్ చేశారు.

  • Share this:
    ప్రముఖ భజన గాయకుడు నరేంద్ర చంచల్ (80) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో కన్నుమూశారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నరేంద్ర చంచల్ దాదాపు మూడు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. నరేంద్ర చంచల్‌ను భజన్ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. కేవలం భజన పాటలే.. కాదు సినిమా పాటలను కూడా భజన్ చంచల్ ఆలపించారు. ఎన్ని హిందీ సినిమాల్లో ఆయన పాడారు. కేవలం పంజాబ్ మాత్రమే కాదు.. నరేంద్ర చంచల్ భజన పాటలకు ఉత్తరాదిన ఎంతో క్రేజ్ ఉంది.

    నరేంద్ర చంచల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని ప్రధాని ట్వీట్ చేశారు. తనదైన గాత్రంతో పాటల ప్రపంచంలో ఎంతో పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


    చంచల్ మృతిపై ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహిందీ కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.


    కాగా, నరేంద్ర చంచల్ స్వస్థల పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా నమక్ మండి. 1840, అక్టోబరు 16న పంజాబీ ఫ్యామిలీలో ఆయన జన్మించారు. వారిది ఆధ్యాత్మిక కుటుంబం కావడం వల్ల చిన్నప్పటి నుంచే భజన పాటలు ఆలపించే వారు. 1973లో వచ్చిన బాబీ మూవీలో 'బేషక్ మందిర్ మసీద్' పాటను నరేంద్ర చంచల్ ఆలపించారు. ఆ పాటకు ఉత్తమ ప్లేబ్యాక్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు దక్కింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు