Indian Idol Season 12: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సింగింగ్ రియాలిటీ ఇండియన్ ఐడల్. ఈ షో 12వ సీజన్ ఫైనల్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సీజన్ టైటిల్‌ను ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్ సొంతం చేసుకన్నాడు. ఇండియన్ ఐడల్ సీజన్-12 ఫైనల్‌ను నిర్వాహకులు చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫైనల్‌ను 12 గంటల పాటు ప్రసారం చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఫైనల్ కొనసాగింది. ఇక, ఫైనల్‌లో నిలిచిన.. పవన్‌దీప్ రాజన్, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ, కోల్‌కత్తాకు చెందిన అరుణిత, మంగళూరుకు చెందిన నిహల్, మహారాష్ట్రకు చెందిన సెల్లీ కంబ్లే, ఢిల్లీకి చెందిన మహ్మద్ దనీష్ టైటిల్ కోసం పోటీ పడ్డారు.
ఈ కార్యక్రమానికి ఆదిత్య నారాయణ్ హోస్ట్‌గా, హిమేశ్ రేష్మియా, అను మాలిక్, సోను కక్కర్ జడ్డిలుగా ఉన్నారు. ఇక, గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్‌కి సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ, ఉదిత్ నారాయణ్, అల్కా యజ్ఞిక్ అతిథులుగా విచ్చేశారు. గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ విషయానికి వస్తే చాలా వేడుకగా సాగిందనే చెప్పాలి. ఆరుగురు ఫైనలిస్ట్‌లు కూడా ఫైనల్ వేదికపై అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. అయితే చివరకు టైటిల్ మాత్రం.. పవన్‌దీప్ రాజన్‌ను వరించింది. దీంతో నిర్వాహకులు పవన్‌దీప్‌కు రూ. 25 లక్షల క్యాష్ ప్రైజ్, మారుతి స్విప్ట్ కారు అందజేశారు. ఇక, అరుణిత ఫస్ట్ రన్నరప్‌గా, సైలీ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. దనీష్.. నాలుగో స్థానంలో, నిహల్ ఐదో స్థానంలో, షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచారు. ఇక, ఇండియన్ ఐడల్ షోను సోనీ లివ్ యాప్, ఫస్ట్ క్రై డాట్ కామ్ వెబ్ ప్రేక్షకులు వేసే ఓట్లు
అయితే విశాఖపట్నంకు చెందిన షణ్ముఖ ప్రియ ఫైనల్‌లో నిలవడంతో.. ఈ షో ఫైనల్‌ను తెలుగు రాష్ట్రాలకు చెందిన సంగీత ప్రియులు కూడా ఆసక్తిగా వీక్షించారు. అయితే అలాంటి వారికి నిరాశే ఎదురైంది. ఫైనల్‌లో షణ్ముక ప్రియ మిగతా టాప్ 5 కంటెస్టెంట్స్‌తో పోటీ పడింది. సీజన్ ప్రారంభం నుంచి షణ్ముఖ ప్రియ తనదైన ప్రదర్శనతో అభిమానులను అలరించింది. షో మొత్తంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుంది. ఆమె సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ఆమెకు మద్దుతుగా బాగానే ఓట్లు పోలయ్యాయి. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముక ప్రియకు హీరో విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వీడియో సందేశం ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. తన ఫేవరేట్ హీరో తనకు విషెస్ చెప్పడంతో షణ్మకప్రియ ఆనందంలో మునిగిపోయింది. అయితే చివరకు ఆమె ఆరో స్థానంలో నిలవడం ఆమె అభిమానులకు, తెలుగు రాష్ట్రాల్లో సంగీత అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది.
India ki ajoobi #IdolShanmukhapriya ki iss electrical finale performance ne kar diya na deewana! Dekhte rahiye #IndianIdol2020 #AdityaNarayan #HimeshReshammiya @fremantle_india @The_AnuMalik @SonuKakkar @ShanmukhapriyaO #GreatestFinaleEver pic.twitter.com/XVaeTwetn0
— sonytv (@SonyTV) August 15, 2021
ఇప్పటివరకు ఇండియల్ ఐడల్ ట్రోపిని.. ఇద్దరు తెలుగు సింగర్స్ సొంతం చేసుకున్నారు. సీజన్ 5లో శ్రీరామ్‌చంద్ర, సీజన్ 9లో రేవంత్ విజేతలుగా నిలిచారు. ఇక, ఇండియన్ ఐడల్ సీజన్ 2లో తెలుగు సింగర్ కారుణ్య.. రన్నరప్‌గా నిలిచాడు. అయితే తాజా సీజన్‌లో ఫైనల్‌కు చేరిన షణ్ముఖ ప్రియ.. ఆరో స్థానంలో నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sony TV