కరోనా పై పోరాటంలో చేతులు కలిపిన ఇండియన్ సూపర్ స్టార్స్..

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచ ప్రజలను కరోనా మహామ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా కరోనా మహామ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా సినీ నటులు ఒక ష్టార్ట్ ఫిల్మ్ రూపొందించారు.

news18-telugu
Updated: April 7, 2020, 3:24 PM IST
కరోనా పై పోరాటంలో చేతులు కలిపిన ఇండియన్ సూపర్ స్టార్స్..
కరోనా పై పోరులో ఇండియన్ టాప్ స్టార్స్ షార్ట్ ఫిల్మ్ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచ ప్రజలను కరోనా మహామ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పోరాటంలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు కరోనా మహామ్మారిని తరిమి కొట్టడంలో భాగంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు ఓసారి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం తెలిపారు. తాజాగా  దేశ ప్రజలందరు బీదా, గొప్పా అనే తేడా లేకుండా అందరు దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఆదుకునేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు ముందుకొచ్చారు. తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అమితాబ్ బచ్చన్, రజినీకాంత్,మోహన్ లాల్, మమ్ముట్టి, చిరంజీవి, శివరాజ్ కుమార్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్,దిల్జీత్ దోసాంజ్, ఆలియా భట్ వంటి ఇంకొందరు స్టార్స్ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఈ వీడియోను ప్రసూన్ పాండే డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాను సోనీపిక్చర్స్, కళ్యాణ్ జ్యుయలర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఎవరికి వారు వారింట్లో ఉండి తీసిందే. ఈ ఫిల్మ్ ముఖ్య ఉద్దేశ్యం రోజువారి కూలీలకు సహాయం చేయడానికి ఈ వీడియో రూపొందించినట్టు అమితాబ్ ఈ వీడియో చెప్పారు.


ఈ షార్ట్ ఫిల్మ్‌లో అమితాబ్ బచ్చన్ తన కళ్ళాద్దాల కోసం వెతుకుతుంటారు. అవి దొరక్కపోవడంతో దిల్జీత్ దోసాంజ్, రణ్‌వీర్ సింగ్ వెతుకుతుంటారు. ఇందులో భాగంగా రజినీకాంత్,చిరంజీవి,ఆలియా భట్, మోహన్ లాల్, మమ్ముట్టి శివరాజ్ కుమార్ వాళ్ల వాళ్ల పనులతో బిజీగా ఉంటారు. ఈ సమయంతో దిల్జీత్, రణ్‌వీర్ ఇద్దరు కళ్లద్దాల గురించి వాళ్లను అడుగుతారు. చివరకు ఆ కూలింగ్ గ్లాసెస్‌ను ప్రియాంక చోప్రా బిగ్‌బీకి అందజేయడంతో షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించన వాళ్లందరు ఆయా భాషల్లోనే మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో అందరు ఒక్కటే అని ఈ వీడియో సందేశాన్ని పంపించింది. అంతేకాదు కరోనా మహామ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని పిలుపునిచ్చారు.
First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading