దర్శకుడు శంకర్ సేఫ్.. హాస్పిటల్‌కు వచ్చి బాధితులకు పరామర్శ..

Director Shankar: భారతీయుడు 2 సెట్స్‌లో జరిగిన భారీ ప్రమాదం గురించి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. కమల్, శంకర్ లాంటి క్రేజ్ కాంబినేషన్‌లో వందల కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న సినిమా సెట్‌‌లో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 20, 2020, 7:58 PM IST
దర్శకుడు శంకర్ సేఫ్.. హాస్పిటల్‌కు వచ్చి బాధితులకు పరామర్శ..
దర్శకుడు శంకర్ (director shankar)
  • Share this:
భారతీయుడు 2 సెట్స్‌లో జరిగిన భారీ ప్రమాదం గురించి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. కమల్, శంకర్ లాంటి క్రేజ్ కాంబినేషన్‌లో వందల కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న సినిమా సెట్‌‌లో ఇంత భారీ ప్రమాదం జరగడం అందరికీ షాక్ ఇచ్చే విషయమే. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అంతా స్పందించారు. లైకా ప్రొడక్షన్ హౌజ్ కూడా తమకు ఈ బాధ గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటూ ట్వీట్ చేసింది. ఇక కమల్ అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లి రాత్రి నుంచే అక్కడి పనులు చూసుకుంటున్నాడు. కానీ దర్శకుడు శంకర్ నుంచి మాత్రం ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా రాలేదు. దీనికి సమాధానం ఇప్పుడు వచ్చింది. ఆయన క్షేమంగానే ఉన్నాడు.

దర్శకుడు శంకర్ (director shankar)
దర్శకుడు శంకర్ (director shankar)


అసలు శంకర్ ఎలా ఉన్నాడు.. ఆయన నిజంగానే క్షేమంగా ఉన్నాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన హాస్పిటల్‌కు వచ్చాడు. కమల్ హాసన్‌తో పాటే ఆయన కూడా వచ్చి బాధితులను పరామర్శించాడు. ఈ ప్రమాదం సమయంలో ఆయనకు కూడా గాయాలయ్యాయని ముందు కొన్ని వార్తలు వచ్చినా కూడా అందులో ఎలాంటి నిజం లేదని శంకర్ సన్నిహితులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ముగ్గురు చనిపోయారని.. మరికొందరు గాయపడ్డారని మాత్రమే చెప్పారు కానీ శంకర్ ఎక్కడున్నాడనేది దాచేసారు. అయితే అందరి అనుమానాలకు తెరదించుతూ ఈయన హాస్పిటల్ వచ్చి గాయపడ్డ వాళ్లను పరామర్శించాడు.

దర్శకుడు శంకర్ (director shankar)
దర్శకుడు శంకర్ (director shankar)


అసలు రాత్రి ప్రమాదం జరిగిన దగ్గర్నుంచి కూడా ఇప్పటి వరకు శంకర్ ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. అందుకే లేనిపోని అనుమానాలు వచ్చాయి. అందుకే శంకర్ కూడా గాడపడ్డాడా అనే రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిదేం లేదు.. ఆయన క్షేమంగానే ఉన్నాడు. హాస్పిటల్ కూడా రావడంతో మీడియా అతన్ని కవర్ చేసింది. ఈ ప్రమాదం గురించి అడిగేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఈ దర్శకుడు. దీనిపై త్వరలోనే మీడియా ముందుకు వచ్చి శంకర్ మాట్లాడతాడని తెలుస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: February 20, 2020, 7:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading