హోమ్ /వార్తలు /సినిమా /

ఇండియా-పాకిస్తాన్ వార్ ఎఫెక్ట్.. మ‌హేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ‘మేజ‌ర్’..

ఇండియా-పాకిస్తాన్ వార్ ఎఫెక్ట్.. మ‌హేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ‘మేజ‌ర్’..

మహేష్ బాబు మేజర్ సినిమా

మహేష్ బాబు మేజర్ సినిమా

క్ష‌ణం, గూడ‌చారి లాంటి సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడ‌వి శేష్. ప‌క్కా స్క్రీన్ ప్లేతో ఆయ‌న వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న మ‌హేష్ బాబు నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు.

క్ష‌ణం, గూడ‌చారి లాంటి సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడ‌వి శేష్. ప‌క్కా స్క్రీన్ ప్లేతో ఆయ‌న వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న మ‌హేష్ బాబు నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. దేశంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల దృష్ట్యా స‌రిగ్గా అలాంటి స‌బ్జెక్ట్ ఎంచుకుని వ‌స్తున్నాడు అడ‌వి శేష్. ఇండియా పాకిస్తాన్ మ‌ధ్య జ‌రుగుతున్న వార్ ఫోక‌స్ చేస్తూ 26 బై 11 అటాక్స్ పై ఇప్పుడు ఓ సినిమా వ‌స్తుంది. అప్పుడు జ‌రిగిన న‌ర‌మేధంలో ఎంద‌రో అమ‌యాకులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల‌లో చాలా మందిని ముంబై పోలీసులు త‌మ ప్రాణాల‌కు ఒడ్డి కాపాడారు.


India vs Pakistan War Effect.. Adivi Sesh new movie titled as Major produced by Mahesh Babu pk.. క్ష‌ణం, గూడ‌చారి లాంటి సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడ‌వి శేష్. ప‌క్కా స్క్రీన్ ప్లేతో ఆయ‌న వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న మ‌హేష్ బాబు నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. adivi sesh major movie,adivi sesh mahesh babu major movie,major movie adivi sesh,telugu cinema,india vs pakistan,attacks 26/11 movie,major sandeep unnikrishnan adivi sesh,sashi kiran tikka adivi sesh,mahesh babu adivi sesh major movie,telugu cinema,అడవి శేష్,అడవి శేష్ మహేష్ బాబు,అడవి శేష్ మేజర్ సినిమా,అడవి శేష్ అటాక్స్ 26/11 మేజర్ సినిమా,మేజర్ సందీప్ ఉన్నికృష్ణణ్ అడవి శేష్,తెలుగు సినిమా
మేజర్ సినిమా షూటింగ్


అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌ణ్. అప్ప‌ట్లో ఆయ‌న త‌న ప్రాణం పోతున్నా కూడా ఎంతోమందిని ముష్క‌ర మూక నుంచి కాపాడారు. ఇప్పుడు ఆయ‌న జీవితం ఆధారంగా.. ఆ సంఘ‌ట‌న చుట్టూ ఈ క‌థ‌ను అల్లుకున్నారు అడవి శేష్ అండ్ టీం. ఈ సినిమాకు మేజ‌ర్ అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల్లో కూడా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంతోనే సోనీ పిక్చ‌ర్స్ తెలుగులో అడుగు పెడుతుంది. మ‌హేష్ బాబు ఎంట‌ర్టైన్మెంట్స్ కూడా ఈ సినిమాను నిర్మిస్తుంది. 2020లో సినిమా విడుద‌ల కానుంది.

First published:

Tags: Adivi Sesh, India VS Pakistan, Mahesh babu, Pulwama Terror Attack, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు