టిక్ టాక్‌ బ్యాన్ మంచి నిర్ణయం.. అదో టైమ్ వేస్ట్ యాప్.. : కమెడియన్ సలోని గౌర్..

చైనా యాప్‌లను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ సోషల్ మీడియా స్టార్ కమెడియన్ సలోని గౌర్ ప్రశంసించింది.

news18-telugu
Updated: June 30, 2020, 11:11 AM IST
టిక్ టాక్‌ బ్యాన్ మంచి నిర్ణయం.. అదో టైమ్ వేస్ట్ యాప్.. : కమెడియన్ సలోని గౌర్..
సలోని గౌర్ Photo : Twitter
  • Share this:
చైనా యాప్‌లను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ సోషల్ మీడియా స్టార్ కమెడియన్ సలోని గౌర్ ప్రశంసించింది. తాజాగా ఇండియన్ గవర్నమెంట్ చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సలోని గౌర్ ఓ నేషనల్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత, చైనా సైన్యాలు లడఖ్‌లో సరిహద్దులో ఉద్రిక్తతల, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మరో 58 యాప్‌లను నిషేధించాలని భారత్ తీసుకున్న నిర్ణయం మంచి స్టెప్ అంటూ ప్రశంచింది. ఆమె మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని "టిక్‌టాక్ సృష్టికర్తలకు డీమోనిటైజేషన్" గా అభివర్ణించింది. గతంలో తాను ఇండియా-చైనా సమస్యపై ఓ వీడియోను తన అకౌంట్‌లో పోస్ట్ చేయగా ఆ వీడియోను టిక్ టాక్ తీసివేసిందని అయితే విమర్శలు రావడంతో వెంటనే టిక్‌టాక్ దాన్ని అన్‌బ్లాక్ చేసిందని తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. టిక్ టాక్‌లో ఉండేది కంటెంట్ కాదు. అదో పెద్ద టైమ్ వేస్టు అని పేర్కోంది.

First published: June 30, 2020, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading