Home /News /movies /

INDEPENDENCE DAY 2022 AZADI KA AMRIT MAHOTSAV FROM VANDEMATARAM TO RRR THESE ARE THE FAMOUS TOLLYWOOD PATRIOTISM SONGS TA

Independence Day 2022: ఎత్తర జెండా అంటూ దేశభక్తి చాటిన టాలీవుడ్‌‌.. నాటి నుంచి నేటి వరకు అలరించిన పాటలు ఇవే..

టాలీవుడ్‌లో దేశభక్తిని ప్రేరేపించిన పాటలు (Twitter/Photo)

టాలీవుడ్‌లో దేశభక్తిని ప్రేరేపించిన పాటలు (Twitter/Photo)

Independence day 2022: ఎందరో మహాత్ముల త్యాగఫలం మన దేశ స్వాతంత్య్రం తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజిది. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’. స్వాతంత్య్రం ఎలా వచ్చింది? ఎంత కష్టపడితే వచ్చిందీ? అన్న విషయాన్ని ఎందరో సినీ కవులు తమ కలంతో స్ఫూర్తి దాయకంగా చెప్పారు. దేశభక్తిని రగిలించిన కొన్ని పాటలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకుందాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఎందరో మహాత్ముల త్యాగఫలం మన దేశ స్వాతంత్య్రం తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజిది. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’. స్వాతంత్య్రం ఎలా వచ్చింది? ఎంత కష్టపడితే వచ్చిందీ? అన్న విషయాన్ని ఎందరో సినీ కవులు తమ కలంతో స్ఫూర్తి దాయకంగా చెప్పారు. దేశభక్తిని రగిలించిన కొన్ని పాటలను ఈ 75 యేళ్లు పూర్తైన నేపథ్యంలో మనమందరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అలరించిన కొన్ని దేశ భక్తి గీతాలను స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్మరించుకుందాం..

    మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాటను అందరినీ తట్టిలేపింది. 2020 యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

    రాముడు భీముడులో ఉందిలే మంచి కాలం స్వాతంత్య్రం నాటి కాలాన్ని గుర్తుకు తెస్తోంది. డి. రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలోని పాట ఎపుడు స్వాతంత్య్ర, గనతంత్య్ర దినోత్సవాల రోజున వినపడుతూనే ఉంటుంది.

    మేజర్ చంద్రకాంత్‌లోని ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా హీరోగా ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం.

    స్వాతంత్య్రం వచ్చిందని సంబరపడితే కాదు. మనమెలా మెలిగితే దానికి సార్థకత చేకూరుతుందో తెలిపే కమ్మని పాట.. పాడవోయి భారతీయుడా అనే పాట వెలుగు నీడలు సినిమాలో ఉంది.

    ఎన్టీఆర్ హీరొోగా నటించిన ‘బడి పంతులు’ సినిమాలోని ఈ పాట ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజు వినిపిస్తూనే ఉంటుంది.

    ‘ఖడ్గం’లో మే మే ఇండియన్స్ పాట దేశభక్తిని చాటి చెబుతోంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాట ఎప్పటికీ నిలిచిపోతుంది.

    ఏఎన్నార్ నటించిన ‘సిపాయి చిన్నయ్య’లోని ఈ సాంగ్ జన్మభూమిని గొప్పదనాన్ని తెలుపుతూ ఉన్న ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్.

    ‘బద్రి’లోని ఐ యామ్ ఇండియన్ సాంగ్ మన భారతీయతను చాటే పాట. పూరీ జగన్నాథ్ తొలి సినిమాలోనే పవన్ కళ్యాణ్‌తో ఈ తరహా పాటను తెరకెక్కించాడు. అటు ఖుషీలో కూడా ‘ఏ మేరా జహాన్’ పాట కూడా దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిందే.

    ‘బాబీ’సినిమాలో ఈ పాట కూడా దేశభక్తిని చాటుతుంది. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కే.రాఘవేంద్రరావు సమర్ఫణలో తెరకెక్కింది.

    కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’లోని తెలుగువీర లేవరా పాట స్వాతంత్య్ర స్పూర్తిని రగిలిస్తుంది. శ్రీశ్రీ రచించిన ఈ పాటతో తెలుగు పాటకు తొలిసారి జాతీయ అవార్డు వచ్చింది. ఈ పాట ఎందరికో స్పూర్తి రగిలించింది.

    ‘బొబ్బిలిపులి’లోని జననీ జన్మభూమిశ్చ పాట కూడా జన్మభూమి స్వర్గం కన్న గొప్పది అంటూ చెప్పే దేశభక్తి గీతం. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ దేశ భక్తి గీతాల్లో ఒకటి.

    ‘కోడలు దిద్దిన కాపురం’లో ఈ పాట దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానుభావులను గుర్తుకు తెస్తుంది. ఈ దేశం ఈ సంఘం నిను మరవద్దు .. జాతిని నడిపిన నీతిని నిలిపిన మహనీయులను మరవద్దు అంటూ వచ్చిన సాంగ్ దేశభక్తిని ప్రేరేపించేదే.

    ‘నేటి భారతం’లో భారత నారిని నేను బందినై పడి ఉన్నాను సాంగ్ కూడా దేశభక్తిని గుర్తుకు తెచ్చే పాట. ఈ  సినిమాలోని పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్.

    ‘సుల్తాన్’ సినిమాలో జనగణమన జనయిత్రి నా జన్మ భూమి పాట కూడా స్వాతంత్య్ర స్తూర్తిని రగిలించే పాటల్లో ఒకటి. జాలాది రాసిన పాటకు కోటి అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. ఇందులో కృష్ణ,కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి టాలీవుడ్ కృష్ణత్రయం ఈ దేశభక్తి గీతంలో నటించడం విశేషం.

    ‘ఝుమ్మంది నాదం’లో దేశమంటే ఈ పాట కూడా జాతీయతను చాటుతుంది. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాట దేశభక్తిని చాటుతుంది.

    అటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌లోని ‘ఎత్తర జెండా’ పాట దేశ భక్తిని నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్, రాజమౌళి అతిథి పాత్రల్లో మెరిసారు. వీటితో పాటు ఎన్నో దేశ భక్తి గీతాలు టాలీవుడ్‌లో తెరకెక్కాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
    అనేక వందల సంత్సరాలు దాస్య శృంఖాలల్లో మగ్గిన ఈ భారతదేశం.. స్వేచ్ఛ సాధించి, ఆధునికత వైపు వడి వడిగా పయనిస్తోంది. దేశం అభివృద్ధిలో సాధించిన విజయాలను నాటి నుంచి నేటి వరకూ మన తెలుగు సినిమా పాటలు ప్రస్తావిస్తూనే వచ్చాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 యేళ్లు పూర్తైన సందర్భంగా  స్వతంత్య్ర భారతవనితో పాటు ఈ స్వేచ్ఛాగీతాలకు వందనం అర్పిద్దాం. అందరికీ అమ్మవైన ఓ భారతమాతా.. కాశ్మీరే నీకు తలమానికం. హస్తినే నీ హృదయం.. భరతదేశమే నీ దేహం. అందుకో జేజేలు. ఎందరో మహాత్ములు త్యాగఫలంతో దక్కిన ఈ స్వాతంత్య్రాన్ని భావితరాలకు అలాగే అందించడానికి అందరం కలసి కృషిచేద్దాం. మరోసారి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Azadi Ka Amrit Mahotsav, Independence Day 2022, RRR, Tollywood

    తదుపరి వార్తలు