INDEPENDENCE DAY 2021 HERE IS THE LIST OF SUPER HIT PATRIOTISM SONGS IN TOLLYWOOD TA
Independence Day 20121: టాలీవుడ్లో దుమ్మురేపిన దేశభక్తి గీతాలు ఇవే..పంద్రాగస్టు వేళ మళ్లీ వినండి
ప్రతీకాత్మక చిత్రం
Independence day 2021: ఎందరో మహాత్ముల త్యాగఫలం మన దేశ స్వాతంత్య్రం తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజిది. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’. స్వాతంత్య్రం ఎలా వచ్చింది? ఎంత కష్టపడితే వచ్చిందీ? అన్న విషయాన్ని ఎందరో సినీ కవులు తమ కలంతో స్ఫూర్తి దాయకంగా చెప్పారు. దేశభక్తిని రగిలించిన కొన్ని పాటలను ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్మరించుకుందాం....
ఎందరో మహాత్ముల త్యాగఫలం మన దేశ స్వాతంత్య్రం తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజిది. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’. స్వాతంత్య్రం ఎలా వచ్చింది? ఎంత కష్టపడితే వచ్చిందీ? అన్న విషయాన్ని ఎందరో సినీ కవులు తమ కలంతో స్ఫూర్తి దాయకంగా చెప్పారు. దేశభక్తిని రగిలించిన కొన్ని పాటలను ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్మరించుకుందాం...
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాటను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసారు.
రాముడు భీముడులో ఉందిలే మంచి కాలం స్వాతంత్య్రం నాటి కాలాన్ని గుర్తుకు తెస్తోంది.
మేజర్ చంద్రకాంత్లోని ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్.
స్వాతంత్య్రం వచ్చిందని సంబరపడితే కాదు. మనమెలా మెలిగితే దానికి సార్థకత చేకూరుతుందో తెలిపే కమ్మని పాట.. పాడవోయి భారతీయుడా అనే పాట వెలుగు నీడలు సినిమాలో ఉంది.
ఎన్టీఆర్ హీరొోగా నటించిన ‘బడి పంతులు’ సినిమాలోని ఈ పాట ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజు వినిపిస్తూనే ఉంటుంది.
‘ఖడ్గం’లో మే మే ఇండియన్స్ పాట దేశభక్తిని చాటి చెబుతోంది.
ఏఎన్నార్ నటించిన ‘సిపాయి చిన్నయ్య’లోని ఈ సాంగ్ జన్మభూమిని గొప్పదనాన్ని తెలుపుతూ ఉన్న ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్.
‘బద్రి’లోని ఐ యామ్ ఇండియన్ సాంగ్ మన భారతీయతను చాటే పాట.
‘బాబీ’సినిమాలో ఈ పాట కూడా దేశభక్తిని చాటుతుంది.
కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’లోని తెలుగువీర లేవరా పాట స్వాతంత్య్ర స్పూర్తిని రగిలిస్తుంది.
‘బొబ్బిలిపులి’లోని జననీ జన్మభూమిశ్చ పాట కూడా జన్మభూమి స్వర్గం కన్న గొప్పది అంటూ చెప్పే దేశభక్తి గీతం.
‘కోడలు దిద్దిన కాపురం’లో ఈ పాట దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానుభావులను గుర్తుకు తెస్తుంది.
‘నేటి భారతం’లో భారత నారిని నేను బందినై పడి ఉన్నాను సాంగ్ కూడా దేశభక్తిని గుర్తుకు తెచ్చే పాట.
‘సుల్తాన్’ సినిమాలో జనగణమన జనయిత్రి నా జన్మ భూమి పాట కూడా స్వాతంత్య్ర స్తూర్తిని రగిలించే పాటల్లో ఒకటి.
‘ఝుమ్మంది నాదం’లో దేశమంటే ఈ పాట కూడా జాతీయతను చాటుతుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.