బాలీవుడ్లో ఐటీ కలకలం రేగింది. ప్రముఖ హీరోయిన్ తాప్సీతో పాటు దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత మధవర్మ మంతెన సహా పలువురు ఇళ్లల్లో ఆదాయప పన్నుశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముంబైతో పాటు పుణెలోని వీరి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారని.. పన్నులు ఎగువేస్తున్నారని సమాచారం అందడంతో.. ఐటీ అధికారులు రంగంలోకి దిగి మెరుపు దాడులు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్‌తో అన్ని చిత్ర పరిశ్రమల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Income Tax raids underway at the properties of film director Anurag Kashyap and actor Taapsee Pannu in Mumbai: Income Tax Department
అంతేకాదు బాలీవుడ్ సినీ నిర్మాత వికాస్ బల్, ఫాంటమ్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలు సహా పలు అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాప్సీ, అనురాగ్ కశ్యప్ మాట్లాడారు. ఇటీవల రిహానా పోస్ట్‌కు వ్యతిరేకంగా భారత సెలబ్రిటీలు మాట్లాడాన్ని కూడా వారు తప్పుబ్టటారు.
కాగా, తెలుగు మూవీ ఝుమ్మంది నాదం ద్వారా సినిమాల్లోకి వచ్చిన తాప్సీ.. ఆ తర్వాత తమిళ్‌తో పాటు హిందీ సినీ పరిశ్రమల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ప్రస్తుతం బోల్డ్ బ్యూటీ తాప్సీ పన్ను ప్రస్తుతం శభాష్ మిథు చిత్రంలో నటిస్తోంది. టీమిండియా మహిళా క్రికెటర్ 'మిథాలి రాజ్' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపుదిద్దుకుంటోంది. ఇందులో మిథాలి రాజ్ పాత్ర పోషిస్తోంది తాప్సీ. అందుకోసం క్రికెటర్‌గా మారిపోయింది.శభాష్ మిథు చిత్రానికి రాహుల్ దోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు.