news18-telugu
Updated: November 20, 2019, 12:04 PM IST
హీరో నాని
ఐటీ అధికారులు బుధవారం ఒక్కసారిగా సినీ తారల ఇళ్లు,కార్యాలయాలపై దాడులు ప్రారంభించారు.టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇంట్లో ప్రస్తుతం ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇల్లు,కార్యాలయంలో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నానితో పాటు ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియోలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరికొంతమంది దర్శకులు,నిర్మాతలు,హీరోల ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 10 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు 10చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
Published by:
Srinivas Mittapalli
First published:
November 20, 2019, 12:04 PM IST