హోమ్ /వార్తలు /సినిమా /

IT Raids: అగ్ర నిర్మాతలకు షాక్.. ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు..!

IT Raids: అగ్ర నిర్మాతలకు షాక్.. ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు..!

ఇటీవల ప్రారంభించబడిన AIS ఒక సమగ్ర పత్రం, సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ, డివిడెండ్ వంటి సమాచారాన్ని కలిగి ఉందని చార్టర్డ్ క్లబ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. ఇప్పటికే ఉన్న ఫారమ్ 26AS కేవలం FD వడ్డీని మాత్రమే కలిగి ఉందని.. డివిడెండ్ వివరాలను కలిగి ఉండదని తెలిపారు. అందువల్ల ఇంతకుముందు AIS సమాచారం లేని, ఫారం 26AS ఆధారంగా మాత్రమే రిటర్న్‌లు దాఖలు చేసిన వారికి నోటీసులు అందుతున్నాయని అన్నారు.

ఇటీవల ప్రారంభించబడిన AIS ఒక సమగ్ర పత్రం, సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ, డివిడెండ్ వంటి సమాచారాన్ని కలిగి ఉందని చార్టర్డ్ క్లబ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. ఇప్పటికే ఉన్న ఫారమ్ 26AS కేవలం FD వడ్డీని మాత్రమే కలిగి ఉందని.. డివిడెండ్ వివరాలను కలిగి ఉండదని తెలిపారు. అందువల్ల ఇంతకుముందు AIS సమాచారం లేని, ఫారం 26AS ఆధారంగా మాత్రమే రిటర్న్‌లు దాఖలు చేసిన వారికి నోటీసులు అందుతున్నాయని అన్నారు.

ఈ రోజు ఉదయం నుంచి ఇళ్ళలో, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కోలీవుడ్ అగ్ర నిర్మాతలపై జరుగుతున్న ఐటీ రైడ్స్ చెన్నైలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలుగా పేరు పొందిన కలైపులి ఎస్. థాను (Kalaipuli S Thanu), కెఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja), ఎస్ఆర్ ప్రభు (SR Prabhu) ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఈ రోజు ఉదయం నుంచి ఇళ్ళలో, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కోలీవుడ్ అగ్ర నిర్మాతలపై జరుగుతున్న ఐటీ రైడ్స్ చెన్నైలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. వీరితో పాటు ప్రముఖ నిర్మాత అన్బు చెగియాన్ ఇల్లు, ఆఫీసులపై కూడా ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతున్నాయి.

పలు నివేదికలు అందించిన సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి ఐటీ దాడులు మొదలయ్యాయి. ఒకేసారి 40 చోట్ల అధికారులు దాడులు ప్రారంభించారు. చెన్నై, మధురైతో పాటు చెన్నైలోని నానుగంబుక్కం ప్రాంతంలోని కమ్తర్ నగర్ ఏరియాలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.  అయితే నిర్మాత కూతురు పెళ్లి అయిన ఐదు నెలలకే ఈ దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇటీవలే నిర్మాత చెగియాన్ తన కూతురు పెళ్లి ఘనంగా జరిపారు. ఈ పెళ్లికి పలువురు కోలివుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, బోనీ కపూర్ వంటి ప్రముఖులతో పాటు.. పలువురు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు.  చెగియాన్ మధురైలోనే పుట్టి పురిగారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఆయన పెద్ద ఫైనాన్షియర్‌గా ఎదిగారు. తమిళ్ డైరెక్టర్ శశికుమార్ కజిన్ అశోక్ కుమార్ 2017లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో మొదటిసారిగా చెగియాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అశోక్ కుమార్ సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు చెగియాన్ వేధింపులే కారణమంటూ పేర్కొన్నారు.

ఆ తర్వత 2020లో మరోసారి చెగియాన్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ బిగిల్ అనే సినిమా తీసిన విషయం తెలిసిందే. 2019లో ఈ సినిమా విడుదలైన తర్వాత 2020లో ఈ సినిమా హీరో విజయ్‌తో పాటు ప్రొడక్షన్ హౌస్ పై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో ఈ  పెద్ద ప్రొడ్యూసర్‌కు చెందిన పలు ప్రాంతాల్లోకూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఇప్పుడు మరోసారి కోలీవుడ్‌లో ఐటీ దాడలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.

తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోందని అందరూ చర్చించుకుంటున్నారు. ప్రీవియస్ ఇయర్ టాక్స్ పైలింగ్ లో సరిగా ఫైల్ చేయ లేదని నిర్మాతలపై ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు సమాచారం.  కలైపులి ఎస్. థాను ఆఫీస్ లో.... తమిళ పరిశ్రమలోని అగ్ర నిర్మాతల్లోఒకరైన కలైపులి ఎస్. థాను ఆఫీసుకు ఈ రోజు ఉదయమే ఐటీ అధికారులు చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆయన కంటే ముందు ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెళియన్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు.

First published:

Tags: IT raids, Kollywood, Kollywood Cinema, Kollywood News

ఉత్తమ కథలు