INCOME TAX OFFICIALS ISSUE SUMMONS TO TAMIL SUPER STAR VIJAY SB
స్టార్ హీరోకు ఐటీ నోటీసులు... బీజేపీ టార్గెట్ చేసిందన్న ఫ్యాన్స్
ప్రతీకాత్మక చిత్రం
తమ అభిమాన నాయకుడ్ని బీజేపీ కావాలనే టార్గెట్ చేస్తోందని విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాలో జీఎస్టీ, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా విజయ్ కొన్ని డైలాగ్స్, సెటైర్లు వేశాడు.
తమిళ్ సూపర్ స్టార్ హీరో విజయ్‌కు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. వెంటనే విచారణకు హాజరు వావాలని ఆదేశించింది. అయితే విజయ్ మాత్రం అందుకు నిరాకరించాడు. తాను విచారణకు హాజరుకాలేనని చెప్పేశాడు. ప్రస్తుతం మాస్టర్ సినిమా షూటింగ్లో ఉన్నందును ఐటీ విచారణకు హాజరు కాలేనని ధికారులు చెప్పాడు. దీంతో పాటు విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కేటాయించాలని కోరాడు. దీంతో ఈ విషయంపై విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడ్ని బీజేపీ కావాలనే టార్గెట్ చేస్తోందని విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాలో జీఎస్టీ, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా విజయ్ కొన్ని డైలాగ్స్, సెటైర్లు వేశాడు. మెర్సల్ సినిమా అటు తమిళంలోనే.. ఇటు తెలుగులో ‘అదిరింది’గా మంచి టాక్ తెచ్చుకుంది.
విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మాస్టర్. అయితే ఈ చిత్ర షూటింగ్ నైవేలిలోని ఎన్ఎల్సీ సొరంగం ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఐటీ అధికారులు అక్కడకు వచ్చి ఆయన్ని విచారించిన విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్ ఇంటిలోనూ అధికారులు విచారించారు. అలా రెండు రోజులు విచారణను ఎదుర్కొన్న నటుడు విజయ్ శుక్రవారం తిరిగి మాస్టర్ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు.
అయితే మాస్టర్ చిత్ర షూటింగ్‌ను ఎన్ఎల్సీ సొరంగం ప్రాంతంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి యూనిట్ వర్గాలతో వివాదానికి దిగారు. షూటింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు పలువురు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా గొడవకు దారి తీసి రచ్చరచ్చగా మారింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పి వారిని అక్కడ నుంచి పంపించేశారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.