ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కార్యాలయాలపై ఐటీ దాడులు..

ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకు సంబంధించిన రామా నాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్  కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ ఈ రోజు ఉదయం నుంచి దాడులు మొదలుపెట్టింది.

news18-telugu
Updated: November 20, 2019, 9:26 AM IST
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కార్యాలయాలపై ఐటీ దాడులు..
నిర్మాత సురేష్ బాబు
  • Share this:
ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకు సంబంధించిన రామా నాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్  కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ ఈ రోజు ఉదయం నుంచి దాడులు మొదలుపెట్టింది. గత కొన్నేళ్లుగా రామానాయుడు స్టూడియో‌కు సంబంధించి సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్టు చెబుతున్నారు.  ఈ సోదాల్లో సురేష్ బాబు కార్యాలయాల్లోని కొన్ని కీలక పత్రాలను హార్ట్ డిస్క్‌లను  స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సురేష్ బాబు.. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ‘వెంకీ మామ’ సినిమా తెరకెక్కిస్తున్నారు. దాంతో పాటు పలు సినిమాలను డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. అటు సురేష్‌ బాబుకు సంబంధించిన కార్యాలయాలతో పాటు పలువురు హీరోలు, నిర్మాతలు,దర్శకుల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం.

First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...