news18
Updated: December 2, 2020, 6:16 PM IST
ఇలియట్ పేజ్ (ఫైల్)
- News18
- Last Updated:
December 2, 2020, 6:16 PM IST
Oscar Nominated Actor ఇలియట్ పేజ్ పేరు ఇప్పుడు హాలీవుడ్లో మార్మోగుతోంది. juno, Inception, The Umbrella academy.. తదితర సినిమాల్లో నటించిన ఈ యాక్టర్, తాను ట్రాన్స్‌జెండర్‌ను అని ప్రకటించాడు. ‘నేను ఒక జెండర్ నాన్ బైనరీ ట్రాన్స్ జెండర్ వ్యక్తిని..’ అని మంగళవారం సోషల్ మీడియా ద్వారా అతడు వెల్లడించాడు. "నేను ట్రాన్స్ జెండర్‌ను అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఒక క్వీర్ (queer)గా ఉండటానికే నేను ఇష్టపడుతున్నాను" అని పేజ్ చెప్పారు. ది అంబరెల్లా అకాడమీ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో పేజ్ సిస్ జెండర్ ఉమెన్‌గా నటిస్తున్నారు. దీంట్లో తన పాత్ర పేరు వన్య హార్గ్రీవ్స్. ఈ సూపర్ హీరోస్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సౌండ్ ద్వారా వన్య సూపర్ పవర్స్‌ను పొందుతుంది. ఈ సిరీస్‌లో తన పాత్ర జెండర్‌ను మార్చే ఉద్దేశం లేదని దర్శక, నిర్మాతలు తెలిపారు.
ఇలియట్ పేజ్ ప్రకటన తరువాత ది అంబరెల్లా అకాడమీ IMDB పేజీలో అతడి జెండర్‌ను మార్చింది. అతడి పేరును నెట్‌ఫ్లిక్స్ మెటాడేటాలో అప్డేట్ చేసే పనిలో ఉంది. పేజ్ నటించిన, తమ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ని టైలిల్స్లో ఈ అప్డేట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ 33ఏళ్ల యాక్టర్ 2007లో విడుదలైన కామెడీ డ్రామా సినిమా జూనో లో టైటిల్ క్యారెక్టర్లో నటించాడు. స్వతంత్ర భావాలు ఉన్న టీనేజర్‌గా, అన్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చిన యువతిగా ప్రేక్షకులను మెప్పించాడు. ఈ పాత్రలో నటనకు పేజ్ బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేషన్ సాధించాడు.
స్వాగతించిన హక్కుల కార్యకర్తలు...తాను ట్రాన్స్ జెండర్‌ను అని చెప్పిన పేజ్, తన ఫస్ట్ నేమ్‌ను కూడా మార్చుకుంటున్నట్లు తెలిపారు. LGBTQ కమ్యూనిటీ నుంచి వస్తున్న మద్దతును అతడు ప్రశంసించాడు. ఈ కమ్యూనిటీని ఉద్దేశించి “నేను ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది నుంచి ప్రేరణ పొందాను. ధైర్యం, ఔదార్యంతో ఈ ప్రపంచాన్ని ఇంక్లూజివ్ ప్లేస్‌గా మార్చడానికి నిరంతరం కృషి చేసినందుకు మీకు నా ధన్యవాదాలు” అని పేజ్ చెప్పాడు. ఈ ప్రకటనను సోషల్ మీడియాలో LGBTQ హక్కుల న్యాయవాదులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్వాగతించారు.
Published by:
Srinivas Munigala
First published:
December 2, 2020, 6:11 PM IST