ఆ సంఘటన వల్ల చాలా సినిమాలు కోల్పోయాను..నటి రమ్యక‌ృష్ట సంచలన కామెంట్స్..

ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా రమ్యక‌ృష్ట రాణించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రస్తుతం కూడా తన దైన రీతిలో తెలుగు ప్రేక్షకుల్నీ అలరిస్తున్నారు. ఆమె ఇటీవల..ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌ ఆరంభంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మీడియాతో పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

news18-telugu
Updated: February 19, 2019, 6:09 AM IST
ఆ సంఘటన వల్ల చాలా సినిమాలు కోల్పోయాను..నటి రమ్యక‌ృష్ట సంచలన కామెంట్స్..
రమ్యక‌ృష్ట
  • Share this:

ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా రమ్యక‌ృష్ట రాణించారు. ప్రస్తుతం కూడా తన దైన రీతి నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ అలరిస్తున్నారు.  తన కెరీర్‌ ఆరంభంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఆమె ఇటీవల మీడియాతో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ముతల్‌ వసంతం’ అనే తమిళ్ సినిమా.. సెట్‌లో కాస్త విరామం దొరికితే బాగుండు అనుకుంటూ... ఓ గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశా.  అందులో భాగంగా.. అక్కడున్న మెట్లపై ఓ అడుగు వేశా. అయితే అది కేవలం సెట్ అని, మెట్ల రూపంలో ఉన్న వస్త్రం అని తర్వాత అర్థమైంది. దీంతో కాలు దానిపై పెట్టిన వెంటనే 15 అడుగులు కింద ఉన్న ఫ్లోర్‌పై పడ్డాను... కాలి మడమ విరిగింది’. అని చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు ‘ముతల్‌ వసంతం’ సినిమా నటుడు అరుణ్‌ పాండియన్‌ నన్ను ఎత్తుకుని దవాఖానకు తీసుకెళ్లారు అని అన్నారు.


ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఇంటికి వచ్చిన తర్వాత నొప్పితో తెగ ఏడ్చానని... ఆ గాయం వల్ల ఏడాదిలో మూడు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చిందన్నారు. రమ్యక‌ృష్ట ఆ గాయం గురించి మాట్లాడుతూ.. స్టీల్‌ రాడ్లు పెట్టి, అతికించారు కూడా.. 1984 నాకు అతి కష్టమైన ఏడాది చెప్పోచ్చు.   ఆ గాయం వల్ల రెండు సినిమాలు కోల్పోయాను. అంతేకాదు.. కొందరు నిర్మాతలు.. తనకు ఇచ్చిన అడ్వాన్స్‌‌ను కూడా వెనక్కి తీసుకున్నారు అని..రమ్యక‌ృష్ట.. ఆరోజుల్లో ఎదుర్కోన్న భాదల్నీ చెప్పుకున్నారు.

Published by: Suresh Rachamalla
First published: February 19, 2019, 6:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading