Sai Dharam Tej : బీ అలర్ట్.. మెగా హీరో పేరుతో మోసం..రంగంలోకి సాయి ధరమ్ తేజ్..

In The Name Of Mega Hero Sai Dharam Tej there is a cheating going on and Here The Full Details srd - Sai Dharam Tej : గతేడాది "సోలో బ్రతుకే సో బెటర్‌" చిత్రంతో ఆకట్టుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం "రిపబ్లిక్‌" చిత్రంలో నటిస్తున్నారు. అయితే, ఈ మెగా హీరో పేరుతో మోసానికి పాల్పడుతున్నారు కొందరు.

Sai Dharam Tej : గతేడాది "సోలో బ్రతుకే సో బెటర్‌" చిత్రంతో ఆకట్టుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం "రిపబ్లిక్‌" చిత్రంలో నటిస్తున్నారు. అయితే, ఈ మెగా హీరో పేరుతో మోసానికి పాల్పడుతున్నారు కొందరు.

  • Share this:
    ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సైబర్ నేరాలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త తరహా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. కంటికి కనిపించకుండా ఫోన్లలోనే మాయమాటలు చెప్పి కోట్లకు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అందిన కాడికి దోచుకుని ఫోన్లను స్విచాఫ్ చేసుకుని క్షణాల్లోనే మాయమైపోతున్నారు. బాధితులకు అంతులేని వేదనను మిగుల్చుతున్నారు. దీనికి తోడు వాట్సాప్‌, ఫేస్‌బుక్కుల్లో ఒకరి పేరుని వాడుకుని కొందరు సైబర్‌ దొంగల ముఠా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆపదలో ఉన్నామంటూ, అర్జెంట్‌గా మనీ అవసరం అంటూ ఫ్రెండ్స్ పేర్లతో డబ్బులు వసూలు చేసే నేరగాళ్లు ఈ మధ్య ఎక్కువయ్యారు. సాధారణ వ్యక్తుల నుంచి, సెలబ్రిటీల వరకు దీనికి బాధితులుగా మారుతున్నాయి. తాజాగా టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ విషయంలో అదే జరిగింది. ఆయన పేరుతో ఓ సైబర్‌ నేరగాడు డబ్బులు వసూలు చేయబోయిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. తాను సాయిధరమ్‌ తేజ్‌ని అని ,15000 కావాలని ఓ ఫ్రెండ్‌ని అడుగుతున్నట్టుగా ఓ వాట్సాప్‌ చాట్‌ని తాజాగా సాయిధరమ్‌ తేజ్‌ పంచుకున్నారు. ఇలాంటి నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. `

    "ఓ వ్యక్తి నాలా మారి, నాకు మనీ అవసరం ఉన్నట్టుగా మరో వ్యక్తిని డబ్బులు అడుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. దీనిపై నా తరపున నేను లీగల్‌ యాక్షన్స్ తీసుకున్నాను. ఇలాంటి వాటి నుంచి ప్రతి ఒక్కరు అవగాహనతో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కన్వర్జేషన్స్ కి దూరంగా ఉండండి " అని పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలా మోసం చేసేవాడికైనా సిగ్గు ఉండాలి.. డబ్బులు పంపేవాడికైనా సిగ్గుండాలి.. మెగా హీరో, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు ఆర్థిక కష్టాలు ఏంటో? 15 వేలు అడగడం ఏంటో అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.


    గతేడాది "సోలో బ్రతుకే సో బెటర్‌" చిత్రంతో ఆకట్టుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం "రిపబ్లిక్‌" చిత్రంలో నటిస్తున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
    Published by:Sridhar Reddy
    First published: