Home /News /movies /

ILL DIL RAJU PLAN TO RELEASE NAGA CHAITANYA THANK YOU MOVIE IN OTT SB

Naga Chaitanya: నాగ చైతన్య చేస్తున్న ఆ కొత్త సినిమా.. ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారా ?

నాగ చైతన్య ‘థాంక్యూ’ 'సినిమా (Twitter/Photo)

నాగ చైతన్య ‘థాంక్యూ’ 'సినిమా (Twitter/Photo)

నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్‌లో కూడా అమీర్ ఖాన్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. చైతు నటించిన థాంక్యూ సినిమా3 విడుదలకు సిద్దమయ్యింది.

    సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య(Naga Chaitanya) సైతం వరుస సినిమాలతో బిజీగా అయ్యాడు. చైతు రీసెంట్ గా 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె కుమార్ (Vikram K kumar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం థాంక్యూలో చైతన్య నటిస్తున్నాడు.ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై 8న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

    అయితే ఇటీవలే సినిమా టీజర్   కూడా విడుదల అయ్యింది. థాంక్యూ సినిమాకు( Thank You) బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.‘థాంక్యూ’ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది...కానీ అనేక కారణాల వల్ల విడుదల లేట్ అవుతూ వచ్చిందని సమాచారం. మొత్తానికి జూలై రెండో వారంలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఈ చిత్రాన్ని ఎప్పుడో ఓటీటీ ఇచ్చేద్దాం అని నిర్మాత దిల్ రాజు (Dilr Raju) అనుకున్నారని తెలుస్తోంది.



    ఆ మధ్య కాలంలో సినిమా టికెట్ల ధరలకు సంబంధించి టాలీవుడ్‌లో ఇష్యూ నడిచింది. దీంతో ఎందుకు వచ్చిందిలే.. ఓటీటీలో రిలీజ్ చేస్తే మంచిది అని దిల్ రాజు అనుకున్నారంట. అయితే నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఆ నిర్ణయాన్ని దిల్ రాజు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ చిత్రాన్ని కనుక ఓటీటీకి ఇచ్చి ఉంటే దిల్ రాజు విమర్శల పాలయ్యేవారు. ‘వి’ విషయంలో అలాగే విమర్శల పాలయ్యారు దిల్ రాజు. కానీ తర్వాత ఆ సినిమా ఓటీటీకి ఇవ్వడమే మంచిదని అంతా అనుకున్నారు. మరి ‘థాంక్యూ’ రిజల్ట్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

    వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగ చైతన్య హీరోగా థాంక్యూ సినిమాను కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌తో చేశాడు. ఈ సినిమా కత కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. జీవితంలో ఓ పెద్ద స్థాయికి వచ్చిన ఓ హీరో.. అదంతా తన గొప్పతనమే అనే సెల్ఫిష్ గా వ్యవహరిస్తూ ఉంటాడు.అయితే ఒక్కసారిగా మారి తనకు జీవితంలో సాయం చేసిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళ సమస్యల్లో ఉంటే తీర్చి వాళ్లకి థాంక్స్ చెబుతూ వస్తుంటాడు అనేది స్టోరీ లైన్ అని తెలుస్తుంది.మరి థాంక్యూతో నాగ చైతన్య మరో హిట్ కొడతాడో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Dil raju, Naga Chaitanya, Thank You Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు