’పోకిరి’లో మొదట హీరోయిన్‌గా అనుకున్నది ఇలియానాను కాదట.. ఎవరంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా అనుకున్నది ఇలియానాను కాదట.

news18-telugu
Updated: April 29, 2020, 2:14 PM IST
’పోకిరి’లో  మొదట హీరోయిన్‌గా అనుకున్నది ఇలియానాను కాదట.. ఎవరంటే..
పోకిరి సినిమాలో మహేష్ బాబు, ఇలియానా (Twitter/Photo)
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ఇందులోమహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ  సినిమాతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇలియానానకు కాకుండా కంగానాను అనుకున్నారట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కంగనా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె గ్యాంగ్‌స్టర్స్ సినిమా ఆడియన్స్‌కు వెళ్లిన సమయంలో.. పూరీ జగన్నాథ్ ముంబాయిలో పోకిరి సినిమా ఆడిషన్స్ జరగుతున్నాయి ఆ సమయంలో కంగనా రెండింటికి అటెండ్ అయిందట. ఒకేసారి రెండు సినిమాల్లో ఆమె సెలెక్ట్ అయిందనే విషయాన్ని చెప్పింది. అయితే ముందుగా డేట్లు ‘గ్యాంగ్ స్టర్‌’ సినిమాకు ఇచ్చేయడంతో పోకిరి సినిమా చేయలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా కంగాన ప్రస్తావించింది. లేకపోతే.. టాలీవుడ్‌లో నేను పెద్ద హీరోయిన్ అయ్యేదాన్నుంటూ కంగనా తెలిపింది. పోకిరి సినిమాలో నటించపోయినా కంగాన ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం జయలలిత జీవితంపై తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ఏ హీరోయిన్‌ ఇవ్వని విధంగా దాదాపు రూ. 50 లక్షల వరకు ప్రధాని మంత్రి సహాయ నిధితో పాటు దక్షిణ భారత దేశ కార్మికుల కోసం, తలైవి చిత్రానికి పనిచేస్తోన్న కార్మికులకు ఆమె ఈ  విరాళం అందజేసి తన ప్రత్యేకతను చాటుకుంది.

kangana ranaut donates 25 lakh rupees to pm relef fund,kangana ranaut,kangana ranut donates 25 lakhs to pm relef fund,kangna ranauth movies,kangana ranaut corona virus,kangana ranaut covid 19,bollwood,tollywood,కంగనా రనౌత్,కంగనా రనౌత్,కంగనా రనౌత్ 25 లక్షల విరాళం,కంగనా రనౌత్ ఆర్ధిక సాయం,పీఎం రిలీఫ్ ఫండ్‌కు కంగనా ఆర్ధిక సాయం
కంగనా రనౌత్


ఇక వేళ పోకిరి సినిమాలో కంగనా నటించి ఉంటేఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు అవకాశం లేకుండా పోయేది. కేవలం గ్లామర్ పాత్రలే చేయాల్సి వచ్చేది. పోకిరిలో నటించే ఛాన్స్ రాకుండా పోవడం నిజంగా కంగనా అదృష్ణమనే చెప్పాలి. ఈ చిత్రం మిస్ కావడంతో కంగనాకు నటనకు అవకాశం ఉన్న సినిమాలు చేసే అవకాశం వచ్చింది. దాంతో ఆమె మూడు సార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు అందుకుంది. దాంతో పాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ గౌరవాన్ని అందుకుంది. ఒకవేళ పోకిరి సినిమాలో నటించి ఉంటే కంగనాకు నటిగా ఇన్ని అవార్డులు వచ్చేవి కావేమే. కొసమెరుపు ఏమిటంటే.. పోకిరి సినిమాలో ముందుగా హీరోగా అనుకున్నది మహేష్ బాబును కాదు.. పవన్ కళ్యాణ్‌‌ను అనుకున్నారు. పవన్‌కు ఈ సినిమా స్టోరీ నచ్చినా.. ఎందుకో చేయలేదు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 29, 2020, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading