ఇలియానాను ఆ రకంగా ఆదుకుంటున్న టాలీవుడ్ సీనియర్ హీరో..

Ileana D'Cruz : అవకాశాలు రాకపోవడంతో.. కొన్నాళ్లు ఖాళీగా ఉన్న ఇలియానా ఆ మధ్య రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

news18-telugu
Updated: June 30, 2020, 1:05 PM IST
ఇలియానాను ఆ రకంగా ఆదుకుంటున్న టాలీవుడ్ సీనియర్ హీరో..
ఇలియానా Photo : Twitter
  • Share this:
గోవా బ్యూటీ ఇలియానా.. వైవిఎస్ చౌదరి ‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలో ఇలియానా తన నడుమందాలతో తెలుగు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి ఒకే సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో వరుసగా తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ.. తన అందచందాలతో  తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది ఇలియానా. ఓ పక్క ఇటు తెలుగులో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అందులో భాగంగా ఈ భామ అక్కడ 'బర్ఫీ', 'ఫటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అక్కడ బాలీవుడ్‌లోను ఇక్కడ టాలీవుడ్‌లోను అవకాశాలు రాకపోవడంతో.. కొన్నాళ్లు ఖాళీగా ఉన్న ఈ భామ ఆ మధ్య రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ సినిమా సరిగా అలరించకపోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడికి ఛాన్సులే కరువయ్యాయి. ఇన్ని రోజుల తర్వాత ఇలియానా ఓ తెలుగు సినిమా సైన్‌ చేశారని సమాచారం. నాగార్జున హీరోగా వస్తోన్న ఓ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలోనే ఇలియానా హీరోయిన్‌గా చేయనుందట. ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ని పరిశీలిస్తోంది చిత్రబృందం.
First published: June 30, 2020, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading