Ileana : ఇలియానా ది బిగ్ బుల్ ఫస్ట్ లుక్ విడుదల.. హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్..

Ileana D'Cruz : అవకాశాలు రాకపోవడంతో.. కొన్నాళ్లు ఖాళీగా ఉన్న ఇలియానా ఆ మధ్య రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

news18-telugu
Updated: August 18, 2020, 2:08 PM IST
Ileana : ఇలియానా ది బిగ్ బుల్ ఫస్ట్ లుక్ విడుదల.. హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్..
ది బిగ్ బుల్‌లో ఇలియానా లుక్ Photo : Instagram
  • Share this:
గోవా బ్యూటీ ఇలియానా.. వైవిఎస్ చౌదరి ‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలో ఇలియానా తన నడుమందాలతో తెలుగు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి ఒకే సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో వరుసగా తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ.. తన అందచందాలతో  తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది. ఓ పక్క ఇటు తెలుగులో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అందులో భాగంగా ఈ భామ అక్కడ 'బర్ఫీ', 'ఫటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అక్కడ బాలీవుడ్‌లోను ఇక్కడ టాలీవుడ్‌లోను అవకాశాలు రాకపోవడంతో.. కొన్నాళ్లు ఖాళీగా ఉన్న ఈ భామ ఆ మధ్య రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా సరిగా అలరించకపోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడికి ఛాన్సులే కరువయ్యాయి. ఇన్ని రోజుల తర్వాత ఇలియానా ఓ తెలుగు సినిమా సైన్‌ చేశారని సమాచారం. నాగార్జున హీరోగా వస్తోన్న ఓ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలోనే ఇలియానా హీరోయిన్‌గా చేయనుందట. ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ని పరిశీలిస్తోంది చిత్రబృందం.




అది అలా ఉంటే ఇలియానా ప్రస్తుతం హిందీలో అభిషేక్ బచ్చన్‌తో కలిసి 'ది బిగ్ బుల్' అనే సినిమా చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలోని కొన్ని లూప్ హోల్స్‌ను ఆధారంగా చేసుకుని నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో క్రైం డ్రామాగా చిత్రం రూపొందుతుంది ది బిగ్ బుల్. కరోనా కారణంగా ఈ సినిమా కూడా త్వరలో హాట్ స్టార్‌లో విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో ఇలియానా లుక్ రివీల్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో ఇలియానతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నికితా దత్తా, సోహుమ్‌ షా నటిస్తున్నారు. అజయ్ దేవ్ గన్ నిర్మిస్తున్న ఈ సినిమాను కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: August 18, 2020, 2:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading