నితిన్ సినిమాను రిజెక్ట్ చేసిన ఇలియానా.. కారణం తెలిస్తే అంతే..

హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధూన్ సినిమాని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: June 24, 2020, 10:30 AM IST
నితిన్ సినిమాను రిజెక్ట్ చేసిన ఇలియానా.. కారణం తెలిస్తే అంతే..
నితిన్, ఇలియానా Photo : Twitter
  • Share this:
హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధూన్ సినిమాని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా ఉండే టబు పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తే బాగుంటదని ఆలోచిస్తోన్న చిత్రబృందం చాలా మందినే పరిశీలించింది. కొంత నెగెటివ్ టచ్ ఉన్న ఈ పాత్ర కోసం మొదట టబునే చేస్తుందని అన్నారు. ఆ తరువాత ఆ పాత్ర అనసూయకు దక్కిందని కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని రోజులు రమ్యకృష్ణ అని టాక్ నడిచింది. అయితే ఈ పాత్ర చేయాలంటే రమ్య కృష్ణ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోందట. దీంతో ఫైనల్ గా మాత్రం శిల్ప శెట్టిని చిత్రబృందం ఎంచుకుందని టాక్. ఇక్కడ మరో విశేషమేమంటే ఈ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాని మొదట పరిశీలించిందట చిత్రబృందం. అయితే ఆ పాత్రకి ఆమె సింపుల్‌గా నో చెప్పేసిందట. దీనికి కారణం లేకపోలేదు. ఇలియానా గతంలో నితిన్‌తో రెచ్చిపో అనే సినిమా చేసింది. అందుకే మళ్ళీ ఇప్పుడు నితిన్ తో నెగటివ్ క్యారెక్టర్ చేస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోతుందని భావించిఉండవచ్చని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఇలియానకు తెలుగులో ఎలాంటీ ఆఫర్స్ లేవు. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తోన్న ఓ థ్రిల్లర్ మూవీలో ఇలియానాకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆమె చేసే మరో తెలుగు ఈ సినిమా ఇదే కానుంది. మరో పక్క అంధాధూన్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా నటించనుంది.
First published: June 24, 2020, 10:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading