HOME »NEWS »MOVIE »ileana may romance megastar chiranjeevi in koratala siva new movie ak

ఇలియానాకు బంపర్ ఆఫర్... మెగాస్టార్‌తో రొమాన్స్...

ఇలియానాకు బంపర్ ఆఫర్... మెగాస్టార్‌తో రొమాన్స్...
ఇలియానా

చిరంజీవి సరసన ఎవరో కొత్త హీరోయిన్‌ను తీసుకోవడానికి బదులుగా ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ఇలియానాను తీసుకుంటే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.

  • Share this:
    సైరా తరువాత చిరంజీవి నటించబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారనే ప్రచారం జరిగింది. దీంతో ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు ఇద్దరు హీరోయిన్లను వెతికే పనిలో దర్శకుడు కొరటాల శివ ఉన్నారని సమాచారం. ఈ నయా మూవీలోనూ చిరంజీవి సరసన నయనతార నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. సైరా తరువాత చిరంజీవి నయన్ కాంబో మళ్లీ కొరటాల సినిమాలో తళుక్కుమంటుందనే టాక్ వినిపించింది.

    ఇందులో చిరంజీవి సరసన వెటరన్ హీరోయిన్ విజయశాంతి నటించనున్నారనే ఊహాగానాలు కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా... తాజాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే అవకాశం గోవా బ్యూటీ ఇలియానాకు దక్కొచ్చనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. ఇటీవల తన ప్రియుడి నుంచి విడిపోయి మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఇలియానాకు కొరటాల శివ నుంచి ఈ మేరకు కబురు అందిందని టాలీవుడ్‌లో వార్తలు జోరందుకున్నాయి.



    Ileana dcruz, Ileana dcruz to act with chiranjeevi, chiranjeevi koratala siva movie, Ileana separated from boyfriend, megastar chiranjeevi, nayanthara, chiranjeevi new movie, Tollywood, ఇలియానా, చిరంజీవి, కొరటాల శివ, నయనతార, టాలీవుడ్
    కొరటాల శివ మూవీలో చిరంజీవి లుక్


    చిరంజీవి సరసన ఎవరో కొత్త హీరోయిన్‌ను తీసుకోవడానికి బదులుగా ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ఇలియానాను తీసుకుంటే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే మెగాస్టార్ కొరటాల శివ కాంబినేషన్‌లో గోవా బ్యూటీని ఒక హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి బాయ్‌ఫ్రెండ్‌కు దూరమై బాధపడుతున్న ఇల్లీ బేబీకి మెగాస్టార్ సరసన నటించే ఛాన్స్ వస్తే... ఆ బాధ దాదాపుగా తీరిపోయినట్టే అని చెప్పొచ్చు.
    Published by:Kishore Akkaladevi
    First published:September 04, 2019, 19:40 IST