హోమ్ /వార్తలు /సినిమా /

మాట మార్చిన ఇలియానా.. ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కిన గోవాబ్యూటీ..

మాట మార్చిన ఇలియానా.. ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కిన గోవాబ్యూటీ..

ఇలియానా ట్విట్టర్ ఫోటోస్

ఇలియానా ట్విట్టర్ ఫోటోస్

ఇలియానా ఫిక్సైపోయింది.. ఇక్కడే ఉంటావా లేదంటే మళ్లీ వెళ్లిపోతావా అనే ప్రశ్నకు ఎలాంటి బెరుకు లేకుండా సమాధానం చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. తనను రాణిలా చూసుకునే టాలీవుడ్ అంటే తనకెప్పుడూ యిష్టమే అని చెబుతుంది గోవాబ్యూటీ. కానీ ఇది ఇప్పుడు కాదు.. వారం రోజుల కింద. ఇప్పుడు "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమా విడుదలైన తర్వాత మాత్రం రెండు రోజులు కూడా ఆగకుండా ముంబై వెళ్లిపోయి అక్కడ కొత్త సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. జాన్ అబ్రహాం సినిమాలో నటించబోతుంది ఇలియానా.

ఇంకా చదవండి ...

ఆరేళ్ళ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది.. ఏదో మొహమాటంతో ఒప్పుకుందేమో.? ర‌వితేజ‌తో అప్ప‌టికే మూడు సినిమాలు చేసింది క‌దా.. కాదు అన‌లేక ఒప్పుకుందేమో అనుకున్నారంతా. పైగా "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" కోసం ఇలియానాకు ఏకంగా 2 కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు. ఈ సినిమాలో త‌న పాత్ర‌కు సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌. విడుదలకు ముందు అడిగితే ఇక్కడే ఉంటా.. ఇక్కడే తింట అని డైలాగులు చెప్పిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం ముంబై వెళ్లిపోయింది. అమర్ అక్బర్ ఆంటోనీ టాక్ తేడాగా వచ్చేసరికి తన దారి తను చూసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Ileana goes to Bollywood.. doing a movie with Jhon Abraham..  ఇలియానా ఫిక్సైపోయింది.. ఇక్కడే ఉంటావా లేదంటే మళ్లీ వెళ్లిపోతావా అనే ప్రశ్నకు ఎలాంటి బెరుకు లేకుండా సమాధానం చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. తనను రాణిలా చూసుకునే టాలీవుడ్ అంటే తనకెప్పుడూ యిష్టమే అని చెబుతుంది గోవాబ్యూటీ. కానీ ఇది ఇప్పుడు కాదు.. వారం రోజుల కింద. ఇప్పుడు "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమా విడుదలైన తర్వాత మాత్రం రెండు రోజులు కూడా ఆగకుండా ముంబై వెళ్లిపోయి అక్కడ కొత్త సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. జాన్ అబ్రహాం సినిమాలో నటించబోతుంది ఇలియానా. Ileana bollywood,ileana hindi movies,ileana going to bollywood,ileana jhon abraham anees bazmee movie,Telugu movies,Amar Akbar Anthony,ileana ravi teja,ileana amar akbar anthony,ఇలియానా బాలీవుడ్,ముంబై వెళ్లిన ఇలియానా.ఇలియానా తెలుగు సినిమా,ఇలియానా జాన్ అబ్రహాం అనీస్ బజ్మీ మూవీ,అమర్ అక్బర్ ఆంటోనీ ఇలియానా,ఇలియానా రవితేజ,తెలుగు సినిమాల్లోనే నటిస్తానంటున్న ఇలియానా,ఇలియానా శ్రీనువైట్ల
ఇలియానా ట్విట్టర్ ఫోటోస్

సినిమా విడుదలకు ముందు వరకు కూడా అందరికీ ఒకే అనుమానం ఉండేది. ఇలియానా ఇక్క‌డే ఉంటుందా లేదంటే మ‌ళ్లీ ఛ‌లో ముంబై అంటుందా అని..? ఇప్పుడు దీనికి స‌మాధానంగా మొన్నటి వరకు ఇక్కడే ఉంటానని చెప్పింది ఈ భామ. అయితే ఇప్పుడు వెంటనే ముంబై వెళ్లడం.. అక్కడ జాన్ అబ్రహాం సినిమా సైన్ చేయడం కూడా జరిగిపోయాయి. రెడీ ఫేమ్ అనీస్ బజ్మీతో ఓ సినిమాకు సైన్ చేసింది ఇలియానా. చూస్తుంటే మళ్లీ తెలుుగు ఇండస్ట్రీవైపు వచ్చేలా కూడా కనిపించడం లేదు ఈ గోవాబ్యూటీ. "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" ఇచ్చిన షాక్ అలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్ర విడుదల తర్వాత ఎవరూ ఇలియానా గురించి మాట్లాడటం లేదు. త‌న‌కు తెలుగు వాళ్లంటే చాలా ఇష్టం అని.. ఇక్క‌డే త‌న అభిమానులు కూడా చాలా మంది ఉన్నార‌ని.. ఇన్నేళ్లూ మిమ్మ‌ల్ని మిస్ అయినందుకు బాధ‌గా ఉంద‌ని చెప్పింది ఇలియానా. కానీ ఈ మాటలు చెప్పి వారం కూడా కాలేదు అప్పుడే ముంబై ట్రైన్ ఎక్కేసింది ఈ భామ.

Ileana goes to Bollywood.. doing a movie with Jhon Abraham..  ఇలియానా ఫిక్సైపోయింది.. ఇక్కడే ఉంటావా లేదంటే మళ్లీ వెళ్లిపోతావా అనే ప్రశ్నకు ఎలాంటి బెరుకు లేకుండా సమాధానం చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. తనను రాణిలా చూసుకునే టాలీవుడ్ అంటే తనకెప్పుడూ యిష్టమే అని చెబుతుంది గోవాబ్యూటీ. కానీ ఇది ఇప్పుడు కాదు.. వారం రోజుల కింద. ఇప్పుడు "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమా విడుదలైన తర్వాత మాత్రం రెండు రోజులు కూడా ఆగకుండా ముంబై వెళ్లిపోయి అక్కడ కొత్త సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. జాన్ అబ్రహాం సినిమాలో నటించబోతుంది ఇలియానా. Ileana bollywood,ileana hindi movies,ileana going to bollywood,ileana jhon abraham anees bazmee movie,Telugu movies,Amar Akbar Anthony,ileana ravi teja,ileana amar akbar anthony,ఇలియానా బాలీవుడ్,ముంబై వెళ్లిన ఇలియానా.ఇలియానా తెలుగు సినిమా,ఇలియానా జాన్ అబ్రహాం అనీస్ బజ్మీ మూవీ,అమర్ అక్బర్ ఆంటోనీ ఇలియానా,ఇలియానా రవితేజ,తెలుగు సినిమాల్లోనే నటిస్తానంటున్న ఇలియానా,ఇలియానా శ్రీనువైట్ల
ఇలియానా ట్విట్టర్ ఫోటో

మ‌ళ్లీ వ‌చ్చేసాన‌ని.. ఇక అక్కడికి వెళ్ల‌న‌ని చెప్పిన ఇలియానా ఇంత త్వరగా మనసు మార్చుకోడానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈమెకు రెండు కోట్లు ఇచ్చి ప్రోత్సహించే నిర్మాతలు అయితే తెలుుగ ఇండస్ట్రీలో అయితే లేరు. అదే రెండుకోట్లు ఇక్కడ క్రేజీ హీరోయిన్లకు ఇస్తే పండగ చేసుకుంటారు. పైగా ఇప్పుడు హీరోలు ఇల్లీబేబీతో న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌ప్ప‌ట్లా నాజూగ్గా ఉండే ఇలియానా కాదు ఇప్పుడు కాస్త భారీ సైజుల‌తో క‌నిపిస్తున్న బొద్దు ఇలియానా ఇప్పుడు మ‌న‌కు క‌నిపిస్తున్న‌ది. అందుకే ఇలియానా ఇక్క‌డే ఉంటాన‌ని చెబుతున్నా.. ఉండదు అనే నమ్మకం అందర్లోనూ వచ్చేసింది. ఇప్పుడు ఇదే నిజం చేసి చూపించింది ఇలియానా.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ravi Teja, Telugu Cinema

ఉత్తమ కథలు