ఆ హీరో ఫిజిక్‌కు ఇలియానా ఫిదా... కొరికి తినేస్తానంటోన్న గోవా బ్యూటీ..

Ileana D'Cruz : ఇలియానా..‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గోవా ముద్దుగుమ్మ. ఓ హీరో షర్ట్ లెస్ పిక్‌కు ఫిదా అయ్యింది.

news18-telugu
Updated: October 19, 2019, 2:49 PM IST
ఆ హీరో ఫిజిక్‌కు ఇలియానా ఫిదా... కొరికి తినేస్తానంటోన్న గోవా బ్యూటీ..
ఇలియానా (Instagram/ileana_official)
  • Share this:
Ileana D'Cruz : ఇలియానా..‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గోవా ముద్దుగుమ్మ. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత వరుసగా తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ..తన అందచందాలతో  తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది. ఇటు తెలుగులో నటిస్తూనే.. హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా అదరగొట్టింది. అందులో భాగంగా ఈ భామ అక్కడ బర్ఫీ, పటా పోస్టర్ నిఖలా హీరో, మెయిన్ తెరా హీరో, రుస్తుం లాంటీ సినిమాల్లో అదరగొట్టింది.
 View this post on Instagram
 

Waiting for the sun to come out ☀️ • • • 📸 @colstonjulian 💥


A post shared by Ileana D'Cruz (@ileana_official) on

ఆ తర్వాత అక్కడ అవకాశాలు రాకపోవడంతో .. గతేడాది రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఇలియానా ఫిజిక్ చూసి అందరు అవాక్కయ్యారు. కాస్తంత బొద్దుగా కనిపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే ఇలియానా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ  మునుపటి ఇలియానాల సన్నగా నాజూగ్గా రెడీ అయింది.  అది అలా ఉంటే ఈ భామ వరుణ్ ధావన్‌పై ఓ హాట్ కామెంట్ చేసింది. వరుణ్ ఇటీవల షర్ట్ లేని ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోను చూసిన ఈ ముద్దుగుమ్మ.. తన ఆత్రుతను ఆపుకోలేక చాక్‌లెట్ బ్యాయ్‌వా... అంటూ ఓ కామెంట్ పెట్టింది.  దీనికి రిప్లై ఇస్తూ ... చాలా మంది సెలెబ్రీటీస్, నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో వైరల్‌గా మారింది. కాగా ఈ ఇద్దరూ 'మెయిన్ తెరా హీరో' అనే సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఇలియానా 'పాగల్ పన్తీ' అనే సినిమాలో నటిస్తోంది. 
View this post on Instagram
 

🍫


A post shared by Varun Dhawan (@varundvn) on


First published: October 19, 2019, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading