ఆ హీరోతో లిప్ లాక్ సీన్... అమ్మో నరకమంటున్న ఇలియానా

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఇలియానా... ఆ తర్వాత వరుస ఆఫర్లు రావడంతో బాలీవుడ్ బాట పట్టింది.

news18-telugu
Updated: November 17, 2019, 4:51 PM IST
ఆ హీరోతో లిప్ లాక్ సీన్...  అమ్మో నరకమంటున్న ఇలియానా
Instagram
  • Share this:
లవ్ బ్రేకప్ తర్వాత గోవా బ్యూటీ ఇలియాన అనేక సంచలన విషయాలు బయటకు చెబుతోంది. టాలీవుడ్ దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఇల్లీ బేబీ ఆ తర్వాత తెలుగు సూపర్ స్టార్స్‌ అందరితో దాదాపుగా సినిమాల్లో నటించింది. ఆతర్వాత బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది.అయితే బాలీవుడ్‌లో ఈ బ్యూటీ ఫస్ట్ మూవీ బర్ఫీ. ఇటీవల ఇలియానా ఒక ఇంటర్వ్యూకు హాజరై తన మొదటి లిప్ లాక్ సీన్ గురించి మాట్లాడింది. సినిమాల్లో తన మొదటి ముద్దు సన్నివేశాల గురించి చెప్తూ బర్ఫీ సినిమాలో రణబీర్ కపూర్‌ని ముద్దు పెట్టుకోవడం ఓ పీడకల అంటూ సమాధానం ఇచ్చింది. ఆ సీన్‌లో తాను చాలా అసౌకర్యంగా ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ చిత్రం పాగల్ పంతి సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిజి బిజీగా ఉంది. దీనిలో ఇలియానా జాన్ అబ్రహాంతో కలిసి నటిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బర్ఫీలో ఇలియానా మరియు రణబీర్ కపూర్ పెదవులను లిప్ లాక్ సీన్ చేశారు. ఈ చిత్రంలో వారి లిప్ లాక్ వారి స్క్రీన్ కెమిస్ట్రీకి మరింత మసాలాను జోడించింది.అయితే గతంలో బర్ఫీ సినిమా ప్రమోషన్స్ సమయంలో మాత్రం ఇలియానా రణ్‌బీర్‌తో కిస్సింగ్ సీన్‌లో ఎలాంటి ఇబ్బందులకు గురికాలేదని తెలిపింది. ముద్దు వెనుక ఎమోషన్స్ ఉంటాయని చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఇల్లీ బేబీ మాట మార్చింది మరి ఆమెకే తెలియాలి.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...