లవ్ బ్రేకప్‌ తర్వాత ఇలియాన ఎమోషనల్ కామెంట్స్

అయితే విడిపోయాక గని నాకు వారి విలువ తెలిసి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పింది ఇలియానా.

news18-telugu
Updated: November 16, 2019, 3:13 PM IST
లవ్ బ్రేకప్‌ తర్వాత ఇలియాన ఎమోషనల్ కామెంట్స్
ఇలియాన
  • Share this:
టాలీవుడ్ హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియాన లవ్ ఈ మధ్య బ్రేకప్ అయ్యింది.తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన ఇలియాన గత కొంతకాలంగా తన చిరకాల మిత్రుడు ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ మెంటైన్ చేసింది. అయితే ఇటీవలే తన ప్రియుడితో విడిపోయినట్లు తెలిపింది, అయితే వీళ్ల బ్రేకప్‌కు కారణాలు మాత్రం ఇల్లీ బ్యూటీ చెప్పలేదు. తాజాగా ఈ విషయమై స్సందిస్తూ.. ఇలియాన చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయింది.

‘నిజానికి మా ఇద్దరి మధ్య రిలేషన్ తెగిపోయి చాలా రోజులైంది. ఆ తర్వాత నుంచి నేను అతనికి దూరంగా ఉంటున్నాను. అయితే అదే సమయంలో నాకు తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే, ఏదైనా ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్న బంధువులు, మిత్రులను అందరిని మనం మర్చిపోతాం, అయితే విడిపోయాక గాని నాకు వారి విలువ తెలిసి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పింది. దీంతో ఇలియానా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Published by: Sulthana Begum Shaik
First published: November 16, 2019, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading