ఇలియానాకు అంత సీనుందా... ఆ మాటలు నిజమేనా ?

బాయ్‌ఫ్రెండ్‌తో లవ్ ఎఫైర్ కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా... అతడి హ్యాండ్ ఇవ్వడంతో మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

news18-telugu
Updated: December 5, 2019, 3:11 PM IST
ఇలియానాకు అంత సీనుందా... ఆ మాటలు నిజమేనా ?
ఇలియానా (Instagram/ileana_official)
  • Share this:
ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ రేంజ్‌ను ఎంజాయ్ చేసిన ఇలియానా... బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో ఇంకా కెరీర్ ఉండగానే... హిందీ సినిమాలపై మోజుతో ముంబైకు ప్రయారిటీ ఇచ్చింది ఇలియానా. అందుకు తగ్గ ఫలితాన్ని కూడా అనుభవించింది. ఇప్పుడు మళ్లీ తెలుగులో సినిమాలు చేద్దామని అనుకున్నా... ఆమెను తెలుగులో పట్టించుకునే వాళ్లు ఎవరూ పెద్దగా లేరు. బాయ్‌ఫ్రెండ్‌తో లవ్ ఎఫైర్ కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ గోవా బ్యూటీ... అతడి హ్యాండ్ ఇవ్వడంతో మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. గతంలో తనకు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో నటించే అవకాశం రెండుసార్లు వచ్చిందని... అయితే కొన్ని ఇతర కారణాల వల్ల తాను వాటికి నో చెప్పానని ఇల్లీ బేబీ కామెంట్ చేసింది. హాట్ బ్యూటీ చేసిన ఈ వ్యాఖ్యలు చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ వదులుకోదని... అయినా ఇలియానా అంతటి అమాయకురాలు కాదని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఆమె చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవని సినీజనం చెవులు కొరుక్కుంటున్నారు.అయినా దీనిపై సల్మాన్ రియాక్ట్ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి... ఇలియానా చెప్పిన మాటలు నిజమే అని అనుకుందాం.
Published by: Kishore Akkaladevi
First published: December 5, 2019, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading