ఇళయరాజాకు సాయం చేయలేనన్న కలెక్షన్ కింగ్.... ఏమైందో తెలుసా?
Mohan Babu - Ilayaraja: మోహన్‌బాబు హీరోగా రూపొందుతోన్న సన్నాఫ్ ఇండియా సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో రఘవీర గద్యంకు సంబంధించిన తాను సాయం చేస్తానని, స్వరాలు అందించాలని ఇళయరాజాను కోరారు మోహన్ బాబు
ఇళయరాజాకు సాయం చేయలేనని ముఖం మీదే చెప్పేశారట మన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. మీరు చేసి పెట్టాల్సిందే అని స్వరజ్ఞాని అడిగినప్పుడు నా వల్ల కాదండీ అని ఖరాఖండిగా, డైరెక్ట్ గా చెప్పేశారట మోహన్‌బాబు. అసలే ముక్కుసూటి మనిషి.. పైగా గట్టిగా చెప్పడం వల్ల ఇళయరాజా ఏమనుకున్నారో ఏమో..!. ఇంతకీ ఇసైజ్ఞానికి మోహన్‌బాబును ఏదో అడగాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ విషయాన్నే తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వేదాంతదేశిక రఘువీరగద్యం గురించి ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? సాహిత్యం గురించి తెలిసిన వారికి, రామభక్తులకు మాత్రం తప్పకుండా తెలిసే ఉంటుంది. అది రామచరితం. రాముడి గొప్పదనాన్ని చెప్పే కావ్యం. సన్నాఫ్ ఇండియా సినిమా కోసం ఇందులోని కొంత భాగాన్ని ట్యూన్ చేయించాలనుకున్నారు మోహన్‌బాబు. అనుకున్నదే తడవుగా ఆయన ఇళయరాజా ముందు వాలిపోయారు. ఈ కావ్యంలోని కొంత భాగాన్ని తన కోసం స్వరపరచమని కోరారు. వెంటనే ఇళయరాజా అందులోని ఫంక్తులకు గాత్రదానం చేయమని మోహన్‌బాబును అడిగారు. అయితే మోహన్‌బాబు అందుకు ఒప్పుకోలేదట. స్వరబద్ధంగా గానం చేయడం తనకు చేతకాదని, తెలియని పనిజోలికి వెళ్లనని గట్టిగా చెప్పేశారట. కాకపోతే గద్యంలో సాయం చేస్తానని అన్నారట. మరి ఇప్పుడు ఆ గాత్రదానం చేసిందెవరు?
ఇళయరాజా ఎలా స్వరపరిచారు. ఇంతకీ అది సినిమాలో ఏ సందర్భంలో వస్తుంది వంటివన్నీ సస్పెన్స్. కాకపోతే ఒకప్పుడు సూపర్, డూపర్, బంపర్ హిట్లు ఇచ్చిన ఇసైజ్ఞానితో మంచు సీనియర్ జోడీ కట్టడం మాత్రం ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ కాంబోకి స్పెషల్ గా ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి స్పెషల్‌గా మెన్షన్ చెయ్యక్కర్లేదనుకోండి. ఈ సారి హిట్ పక్కా రాస్కోండ్రా అన్నట్టుగా ఉంది మోహన్‌బాబు పంథా.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.