హిట్టు కోసం మళ్లీ అతన్నే నమ్ముకున్న కృష్ణవంశీ..

టాలీవుడ్‌లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ.. రాను రాను తన రేంజ్‌కు తగ్గ హిట్టు ఇవ్వలేక రేసులో వెనకబడ్డాడు. అందుకే ఇపుడు చేయబోయే ‘రంగ మార్తాండ’ కోసం అతన్నే నమ్ముకున్నాడు.

news18-telugu
Updated: November 13, 2019, 1:08 PM IST
హిట్టు కోసం మళ్లీ అతన్నే నమ్ముకున్న కృష్ణవంశీ..
కృష్ణవంశీ: ఖడ్గం సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో విజయం కోసం వేచి చూస్తున్నాడు కృష్ణవంశీ. మధ్యలో చందమామ, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాలు పర్లేదనిపించినా.. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో సత్తా చూపించాలని చూస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్.
  • Share this:
టాలీవుడ్‌లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ.. రాను రాను తన రేంజ్‌కు తగ్గ హిట్టు ఇవ్వలేక రేసులో వెనకబడ్డాడు. గత కొంత కాలంగా దర్శకుడిగా ఆయన ట్రాక్ రికార్డు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దర్శకుడిగా ‘చందమామ’ తర్వాత ఆ స్థాయి హిట్టు ఇవ్వలేకపోయాడు. గత చిత్రం ‘నక్షత్రం’ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందుకే పోగుట్టుకున్న చోటే రాబట్టుకున్నట్టు దర్శకుడు కృష్ణవంశీ.. మరాటీలో నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. తెలుగులో నానా పాటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తుండగా.. కథానాయికగా రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇళయరాజాను ఎంపిక చేసారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

ilaiyaraaja compose music to krishna vamsi next project ranga marthanda,krishna vamsi movies,krishna vamsi,ilaiyaraaja krishna vamsi,ilaiyaraja krishna vamsi,krishna vamsi ilairaaja prakash raj ranga marthanda,vamsi movies,vamsi,krishna vamsi hit movies,krishna vamsi romantic songs,pasupuleti krishna vamsi (film director),ilaiyaraaja music live,ilaiyaraja live music,ilaiyaraaja music concert,vamsi krishna yadu vamsi krishna,maestro ilaiyaraaja music concert 2013,idream media presents ilaiyaraaja music concert,ilaiyaraaja music concert live,vamsi old movies,vamsi telugu hits,ilaiyaraaja,tollywood,telugu cinema,కృష్ణవంశీ,ఇళయరాజా,కృష్ణవంశీ ఇళయరాజా,రంగ మార్తాండ,ఇళయరాజా రంగ మార్తాండ మ్యూజిక్
కృష్ణవంశీ,ఇళయరాజా (Twitter/Photo)


గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అంత:పురం’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే రాబట్టింది. అందుకే మరోసారి హిట్టుకోసం ఏరికోరి ఇళయరాజాను ఎంపిక చేసినట్టు సమాచారం.మరి ఇళయరాజా రాకతో కృష్ణవంశీ.. తాను కోరకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 13, 2019, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading