• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • IF YOU HAVE COVID SYMPTOMS CALL THIS MOBILE NUMBER HEROIN NAMITHA REQUEST PEOPLE IN INSTAGRAM SK

Namitha: మీకు కరోనా లక్షణాలున్నాయా? ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి.. నమిత విజ్ఞప్తి

Namitha: మీకు కరోనా లక్షణాలున్నాయా? ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి.. నమిత విజ్ఞప్తి

నమిత (Image:Instagram)

కరోనా లక్షణాలు ఉన్న వారు భారతీయ జనతా యువమోర్చా (BJYM) కోవిడ్ హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలనిహీరోయిన్ నమిత సూచించారు. వారికి కాల్ చేసి ఉచితంగానే డాక్టర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

  • Share this:
    మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ మహోగ్రరూపం దాల్చింది. నిత్యం లక్షలాది కేసులతో పాటు వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ కేసుల నుంచి జనాల్లో ఆందోళ నెలకొంది. సాధారణ దగ్గు వచ్చినా.. జ్వరం వచ్చినా.. కరోనానేమోనని కంగారు పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే ఫీజుల మోత మోగుతుందని... ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పట్టించుకోరన్న భయంతో.. ఇంట్లోనే ఉండి భయం భయంగా బతుకుతున్నారు. ఇలాంటి వారికి హీరోయిన్ నమిత కీలక సూచన చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారు భారతీయ జనతా యువమోర్చా (BJYM) కోవిడ్ హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలని సూచించారు. వారికి కాల్ చేసి ఉచితంగానే డాక్టర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

    ''మీకు కోవిడ్ లక్షణాలున్నాయా? ఐతే ఆందోళన చెందకండి. మీరు ఇంట్లో ఉంటూనే ఉచితంగా డాక్టర్‌ను సంప్రదింవచ్చు. భారతీయ యువ మోర్చా హెల్ప్ లైన్ నెంబర్ర 080 68173286 నెంబర్‌కు కాల్ చేస్తే వైద్య నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తారు.'' అని నమిత పేర్కొన్నారు.


    నమిత ఇన్‌స్టగ్రామ్ పోస్ట్‌ను కొందరు స్వాగతించగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. కరోనా సంక్షోభంలో బీజేపీ కొత్త ప్రమోషన్‌కు శ్రీకారం చుట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. చివరకు కరోనాను కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నరని విమర్శలు గుప్పిస్తున్నారు. మీరు బీజేపీలో చేరారు కదా.. అందుకే బీజేవైఎం గురించి ప్రచారం చేస్తున్నారని నమితపై మండిపడుతున్నారు. ఐతే కరోనా వేళ ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఇవ్వడం ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందని.. ఇందులో రాజకీయాలు చూడకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: