ఇండస్ట్రీలో రాత్రి డిన్నర్‌కు పిలిచారంటే..కొత్త అర్థం చెప్పిన బాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్‌లో తనుశ్రీ దత్తాతో మొదలైనా.. ‘మీటూ’ ఉద్యమం హింది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. మీటూ దెబ్బకు చాలా మంది పలు సినిమాలనుండి తప్పుకున్నారు. అందులో ప్రధానంగా నానా పటేకర్, అలోక్ నాథ్, వికాస్ బల్ పేర్లు వినిపించాయి. అయితే ఈ మీటూతో సినిమా ఇండస్ట్రీలోని మహిళలు ఇప్పటివరకూ నిగూడంగా వున్న విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు

news18-telugu
Updated: February 6, 2019, 10:58 PM IST
ఇండస్ట్రీలో రాత్రి డిన్నర్‌కు పిలిచారంటే..కొత్త అర్థం చెప్పిన బాలీవుడ్ హీరోయిన్
నటి షర్లన్‌చోప్రా Photo: Instagram/sherlynchopra
  • Share this:
తనుశ్రీ దత్తాతో మొదలైనా.. ‘మీటూ’ ఉద్యమం హిందీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. మీటూ దెబ్బకు చాలా మంది పలు సినిమాలనుండి తప్పుకున్నారు. అందులో ప్రధానంగా నానా పటేకర్, అలోక్ నాథ్, వికాస్ బల్ పేర్లు వినిపించాయి. అయితే ఈ మీటూతో సినిమా ఇండస్ట్రీలోని మహిళలు దైర్యంగా ముందుకు వచ్చి.. ఇప్పటివరకూ నిగూడంగా వున్న విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. అందులో భాగంగా.. తాజాగా నటి షర్లన్‌చోప్రా తన అనుభవాల్నీ చెప్పుకొచ్చింది. అందులో భాగంగా.. బాలీవుడ్‌లో డిన్నర్‌కి గల అర్థాన్ని విడమరిచి చెప్పారు. షర్లన్‌చోప్రా ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో డిన్నర్‌కి పిలిచారంటే దాని అర్థమేమిటో తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్‌కి చెందిన నిర్మాతలు, లేదా దర్శకులు అప్పుడప్పుడు నటీమణులను డిన్నర్‌కు పిలుస్తుంటారు. అయితే ఆ పిలుపుని కేవలం డిన్నర్‌కు మాత్రమే కాదని అర్థం చేసుకోవాలన్నారు. దానిని సెక్సువల్ ఫేవర్ కోసమని గ్రహించాలని చెప్పారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. తాను అవకాశాల కోసం నిర్మాత, దర్శకులు దగ్గరకు వెళ్లినపుడు వారు రాత్రి డిన్నర్‌కు వారి ఆఫీసుకు పిలిచేవారని.. మొదట్లో అనుమానం వచ్చేదని..ఆ తరువాత మెల్లమెల్లగా అర్థమయ్యిందని అన్నారు. అయితే కొన్ని అనుభవాల తర్వాత నుండి..కేవలం టాలెంట్ ఉన్న నిర్మాత, దర్శకులనే కలుసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. షర్లన్‌ తెలుగులో  ఏ ఫిల్మ్ బై అరవింద్’, ‘సమ్‌థింగ్ స్పెషల్’ మొదలగు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

Photos: కేథ‌రిన్ థ్రెసా లెటెస్ట్ ఫోటోషూట్

VIDEO : ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై పోలీస్ దాడి..
First published: January 30, 2019, 4:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading