IF THE STORY DEMANDS FOR GLAMOUR ROLE I AM READY TO DO SAYS GUNA 369 ACTRESS ANAGHA SR
కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలకు రెడీ అంటోన్న అందాల అనఘ...
Photo : Instagram.com/officialanagha
‘RX100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, మళయాళీ భామ అనఘ హీరోయిన్‌గా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా..‘గుణ 369’. ఈ సినిమా విడుదల సందర్బంగా హీరోయిన్ అనఘ మీడియాతో మాట్లాడుతూ.. కథ డిమాండ్ మేరకు గ్లామర్ పాత్రల్లో నటించడానికి ఓకే అంటోంది.
‘RX100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, మళయాళీ భామ అనఘ హీరోయిన్‌గా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా..‘గుణ 369’. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ ఫిలిమ్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2 విడుదలైంది. ఈ సందర్బంగా హీరోయిన్ అనఘ మీడియాతో మాట్లాడుతూ.. నేను మలయాళీ అమ్మాయినంటూ.. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అందులో భాగంగా.. చదువు పూర్తయ్యాక సినిమావాళ్లతో పరిచయాలు ఏర్పరచుకున్నాను. అలా మలయాళం సినిమాలో నటించానని చెప్పింది. అయితే ఆ సినిమా హిట్ అవడంతో హీరోయిన్‌గా మలయాళంలోనే మరో రెండు సినిమాలు చేశానని.. అలానే తమిళంలో ‘హిప్ హాఫ్ తమిజా’ తో కూడా చేశానంది. అది కూడా సూపర్‌హిట్ అవ్వడంతో ఆమెను తెలుగులోకి పరిచయం చేయాలని గుణ 369 డైరెక్టర్ అర్జున్ అనుకున్నారు. ఈ మూవీలో తన పాత్ర అచ్చంగా మన పక్కింటి అమ్మాయిగా కనిపించాలని దర్శకుడు నన్ను ఎంపిక చేశారని అంటోంది అనఘ.
తాను అన్ని రకాల పాత్రలు చేస్తానని.. అవసరం అనుకుంటే గ్లామర్ కూడా ఒలకబోస్తానని అందంగా చెబుతోంది. అయితే కథ డిమాండ్ చేయాలట. అది అలా ఉంటే అనఘ తొలి తెలుగు చిత్రం గుణ 369లో అదరగొట్టింది. నటనతో పాటు.. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్ మార్క్స్ సాధించింది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.