హోమ్ /వార్తలు /movies /

RGV comments on RRR: ‘RRR’ ఫ్లాప్ అయితే వాళ్లు నగ్నంగా నడిరోడ్డుపై డాన్సులేస్తారంటున్న వర్మ..

RGV comments on RRR: ‘RRR’ ఫ్లాప్ అయితే వాళ్లు నగ్నంగా నడిరోడ్డుపై డాన్సులేస్తారంటున్న వర్మ..

RGV comments on RRR: నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అని అప్పట్లో మహేష్ బాబు కోసం పాట రాసారు కానీ ఈ పాటకు సరిగ్గా సరిపోయేవాడు మాత్రం రామ్ గోపాల్ వర్మే. పదిమంది వెళ్తున్న దారిలో తానెందుకు వెళ్తాను..

  నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అని అప్పట్లో మహేష్ బాబు కోసం పాట రాసారు కానీ ఈ పాటకు సరిగ్గా సరిపోయేవాడు మాత్రం రామ్ గోపాల్ వర్మే. పదిమంది వెళ్తున్న దారిలో తానెందుకు వెళ్తాను.. తాను నడిచే దారిలోనే పది మంది రావాలంటాడు ఈయన. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు.. గతేడాది లాక్‌డౌన్ సమయంలోనూ ప్రపంచం అంతా స్థంభించిపోతే మీలా నేను ఇంట్లో అంట్లు తోముకుంటూ కూర్చోనంటూ క్లైమాక్స్, కరోనా వైరస్, మర్డర్ అలా చాలా సినిమాలు చేసాడు వర్మ. ఎలా తీసానా అని చరిత్ర అడక్కు.. చెప్పింది విను అంటున్నాడు ఈ దర్శకుడు. ఈ క్రమంలోనే అప్పట్లో తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు వర్మ. ఇండస్ట్రీపై.. ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల మనస్తత్వాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు వర్మ. ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న గొడవలపై కూడా స్పందించాడు ఈ దర్శకుడు. అందరూ ఒకటి కావడం అనేకంటే కూడా పెద్ద బూతు మరోటి లేదని కామెంట్ చేసాడు వర్మ. ఇక్కడ ఎవడికి వాడే.. లోపల బయట మరోలా ఉంటారని చెప్పుకొచ్చాడు. పైన చూసి లోపల అంచనా వేయడం సరైంది కాదని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక్కడంతా పైన పటారం.. లోన లొటారమే అంటున్నాడు ఈయన. ఈ క్రమంలోనే రాజమౌళితో పాటు ఆయన తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ.

  రామ్ గోపాల్ వర్మ (RGV)
  రామ్ గోపాల్ వర్మ (RGV)

  ఇండస్ట్రీలో ఎవరు ఎవర్ని పట్టించుకోరని.. ఏ వ్యక్తి అయినా నష్టపోయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆయనపై జోకులు వేసుకుంటూ.. కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ చెప్పుకొచ్చాడు వర్మ. ఇప్పుడు రాజమౌళి వరస విజయాలు అందుకుంటుంటే పైకి మాత్రం ఆహా ఓహో అంటారు కానీ అదే ఇప్పుడు ఆయన చేస్తున్న ట్రిపుల్ ఆర్ ఫ్లాప్ అయితే మాత్రం చాలా మంది పండగ చేసుకుంటారని ఉన్న వాస్తవం చెప్పాడు వర్మ. కానీ ఇదెవరూ ఒప్పుకోరని చెప్తున్నాడు ఈయన.. ఎందుకంటే నటన అంటున్నాడు ఆర్జీవీ.

  వర్మ రాజమౌళి (RGV Rajamouli)
  వర్మ రాజమౌళి (RGV Rajamouli)

  రాసి పెట్టుకోండి.. ఒకవేళ రేపు ట్రిపుల్ ఆర్ కానీ ఫ్లాప్ అయిందంటే ఇదే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది బట్టలిప్పి నడిరోడ్డుపై షాంపూతో స్నానం చేస్తారు అంటున్నాడు వర్మ. ఈయన వ్యాఖ్యలు చూసి ఇదేం పిచ్చిరా నాయనా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆర్జీవి చెప్పిన దాంట్లో తప్పేముంది.. నిజమే కదా చెప్పాడు. రాజమౌళికి ఫ్లాప్ వస్తే పండగ చేసుకునే వాళ్లు లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్‌లో ఉన్న దర్శకుడిని చూస్తే ఎవరికైనా జెలసీ ఉండటం కామన్ అని.. రాజమౌళిపై కూడా ఇప్పుడు అందరికీ అదే ఉందని చెప్పాడు ఈ దర్శకుడు.

  First published:

  ఉత్తమ కథలు