news18-telugu
Updated: August 24, 2019, 7:27 PM IST
రాజమౌళి, ప్రభాస్ (ఫైల్ ఫోటో)
ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసిన తనివీ తీరని ఇతిహాసం మహాభారతం. ఇప్పటి వరకు మన ఫిల్మ్ మేకర్స్ మహా భారతాన్ని ఎన్నో విధాలుగా తెరకెక్కించిన ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా కన్నడ ఫిల్మ్ మేకర్స్.. నాగన్న శాండిల్ వుడ్లో అత్యధిక బడ్జెట్‌తో ‘కురుక్షేత్ర’ సినిమాను తెరకెక్కించాడు. ఒక్క కన్నడ తప్పించి ఎక్కడ ఈ సినిమా మెరుపులు మెరిపించలేకపోయింది. కన్నడలో కూడా చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు ఏదో పర్వాలేదనిపించింది. ఇక రాజమౌళి కూడా దర్శకుడిగా రిటైర్ అయ్యేలోపు మహాభారతం సినిమాను తెరకెక్కించాలనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నో సార్లు చెప్పాడు.‘మహాభారతం’ లో శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, కర్ణుడు, భీముడు, ధర్మరాజు వంటి ప్రాధాన్య పాత్రలు ఉన్నాయి. ఒకవేళ రాజమౌళి ‘మహా భారతం’ తెరకెక్కిస్తే ఎవరెవరు ఏయే పాత్రలు చేస్తారనే విషయం ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సందర్భంగా ప్రభాస్‌కు తన ‘సాహో’ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీకు మహా భారతంలో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే అందులో ఏ పాత్ర చేస్తారనగా.. ఎలాంటి తట్రపాటు లేకుండా వెంటనే అర్జునుడు క్యారెక్టర్ చేస్తానని చెప్పాడు. ఇక ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు ప్రభాస్.ఒక రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తే.. అందులో అర్జునుడిగా ప్రభాస్‌ను తీసుకుంటాడో లేదో చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 24, 2019, 7:27 PM IST