అనసూయ మీద ఆది వేసే పంచ్ కోసం వీక్షకులు చూస్తారు. ఆ పంచ్ కి సిగ్గుపడుతూ అనసూయ రియాక్షన్ కూడా ఎప్పుడూ హిట్టే... అయితే తాజాగా హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిసింది.
బుల్లితెరపై రొమాంటిక్ పెయిర్ ఎవరంటే కచ్చితంగా సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ అని చెప్పేశేవారు.సుధీర్ కు రష్మీ కి ఎదో ఉందని గాసిప్స్ ఒక దశలో నెట్ ను షేక్ చేశాయి. అయితే వీరిద్దరి తర్వాత ఆ రేంజ్ లో కిక్ ఇస్తున్న పెయిర్, అనసూయ భరద్వాజ్..హైపర్ అది అనే చెప్పాలి. తన పంచ్ టైమింగ్ తో జబర్దస్త్ రేంజ్ ని పెంచేసిన కమెడియన్ ఆది. ఆది కనిపిస్తే చాలు ఎటువంటి పంచ్ లు వస్తాయో అని అందరూ ఎదురు చూస్తారు. ఆది స్కిట్ మొదలైందంటే చాలు ..అనసూయ మీద ఆది వేసే పంచ్ కోసం వీక్షకులు చూస్తారు. ఆ పంచ్ కి సిగ్గుపడుతూ అనసూయ రియాక్షన్ కూడా ఎప్పుడూ హిట్టే... అయితే తాజాగా హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిసింది. ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆహాలో థాంక్యూ బ్రదర్ చిత్రంలో నటించిన అనసూయ, ప్రస్తుతం మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. తాజాగా కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో అనసూయ, హైపర్ ఆదితో కలిసి ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి అనసూయ భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే హైపర్ ఆదికి కూడా తనతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హైపర్ ఆదికి ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఆఫర్లు రావడం లేదు. అనసూయ చేసిన ఈ పనికి ఆది థ్యాంక్స్ చెప్పినట్లు సమాచారం.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.