‘సైరా’ చిరంజీవి చేయకపోయి ఉంటే ఏ హీరో చేసేవాడో తెలుసా..

ఒకవేళ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేయకపోయి ఉంటే..ఈ సినిమాను ఎవరు చేసేవారంటే..

news18-telugu
Updated: October 4, 2019, 5:36 PM IST
‘సైరా’ చిరంజీవి చేయకపోయి ఉంటే ఏ హీరో చేసేవాడో తెలుసా..
‘సైరా నరసింహారెడ్డి’ (File Photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వహించిన  ఈ సినిమాను రామ్  చరణ్ అత్యంత వ్యయ ప్రయాలసకు ఓర్చి నిర్మించాడు. అక్టోబర్ 2న ఐదు భాషల్లో విడుదలైన ఈ  సినిమా తెలుగులో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్‌తో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్  చరణ్‌తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి,జగపతి బాబు,తమన్నా,సాయి మాధవ్ బుర్రాతో పాటు టాలీవుడ్ సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ కూడా హాజరయ్యారు.

‘సైరా’ విజయంతో భావోద్వేగంలో చిరంజీవి, చరణ్, chiranjeevi, ram charan enjoying sye raa movie success
సైరా సక్సెస్‌‌తో ఆనందలో చిరంజీవి, రామ్ చరణ్


ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 2004లో చిరంజీవితో ఈ సినిమా చేయాలనుకున్నాం. ఆ తర్వాత చిరంజీవి 2008లో రాజకీయాల్లో ప్రవేశించారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమా నాతో కాకపోయినా..చరణ్‌తో తెరకెక్కిద్దాం అని అప్పట్లో తమతో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒకవేళ చిరంజీవి రాజకీయాల్లోనే కొనసాగి ఉంటే..‘సైరా నరసింహారెడ్డి’గా రామ్ రణ్‌ను చూసేవాళ్లమన్న మాట.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు