ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ కంప్లీటైంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు.మరోవైపు బాలకృష్ణ మలయాళంలో హిట్టైన అయ్యప్పనన్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ చిత్రంలో బాలయ్య , రానా మరోసారి కలిసి యాక్ట్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ కథ విని బాలయ్య ఈ సినిమాకు నో చెప్పినట్టు వార్తలు వినిపించాయి.
ఇప్పటికే ఒప్పుకున్న కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్న బాలకృష్ణ.. ఇప్పట్లో ఈ సినిమా చేయలేనని చెప్పాడట. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు.. ఈ సినిమాను బాలయ్య రీమేక్ చేస్తేనే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ముందుగా సితార ఎంటర్టైన్మెంట్ వాళ్లు ఈ సినిమా చూసిన తర్వాత అభిప్రాయం చెప్పాలని బాలయ్యను కోరారట. దీంతో నట సింహం.. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా చూసి ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఒకవేళ బాలయ్య ఈ సినిమా ఒప్పుకుంటే.. మరో హీరోగా రానా నటించడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.ఇక ఈ పవర్ఫుల్ మలయాళ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఇప్పటికే సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్లు ఈ రీమేక్ కోసం సందీప్ రెడ్డి వంగా పేరును పరిశీలిస్తున్నారు.
కానీ సందీప్ రెడ్డి ఇప్పటికే రణ‌్‌బీర్ కపూర్ సినిమాకు కమిటైయ్యాడు. కానీ రణ్‌బీర్ కపూర్ సినిమా పట్టాలెక్కడానికి మరింత సమయంలో పట్టేలా ఉంది. అందుకే సితార ఎంటర్టెన్మెంట్ వాళ్లు సందీప్ రెడ్డిని ఈ రీమేక్ కోసం అతన్ని సంప్రదించారట. దీనిపై సందీప్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచాారం. ఒక వేళ సందీప్ రెడ్డి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనని చెబితే.. మరో ఆప్షన్‌గా హరీష్ శంకర్ పేరు కూడా పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే హరీష్ శంకర్ .. పవన్ కళ్యాణ్ సినిమాకు కమిటయ్యాడు. కానీ ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఈ లోపుగా ఈ రీమేక్ ను హరీష్ శంకర్ చేతిలో పెట్టాలనే ఆలోచనలో సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్లు ఉన్నారు. రీమేక్ సినిమాలైతే.. హరీష్ శంకర్ మంచిగా డీల్ చేస్తాడనే పేరుంది. మొత్తంగా బాలయ్య ఈ రీమేక్‌కు ఒప్పుకుంటే.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బాలయ్య.. బి.గోపాల్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైనట్టు వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: B.Gopal, Balakrishna, Boyapati Srinu, Harish Shankar, Malluwood, Sandeep reddy vanga