ఈ మధ్య వరస సినిమాలతో జోరు చూపిస్తున్నాడు వరుణ్ తేజ్. అలాగే విజయాలు కూడా అందుకుంటున్నాడు. ముఖ్యంగా ఫిదా నుంచి వరుణ్ తేజ్ జాతకం మారిపోయింది. అక్కడ్నుంచి విజయాలు కూడా బాగానే వస్తున్నాయి. దాంతో మార్కెట్ కూడా భారీగానే పెరిగిపోతుంది. ఫిదా, ఎఫ్ 2, తొలిప్రేమ, గద్ధలకొండ గణేష్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు వరుణ్ తేజ్. కరోనా కారణంగా మూడేళ్లుగా ఈయన నుంచి సినిమా రాలేదు. ఇప్పుడు గని సినిమాతో ఎప్రిల్ 8న వస్తున్నాడు మెగా వారసుడు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే గని, ఎఫ్ 3 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ప్రవీణ్ సత్తారు సినిమాను ఈ మధ్యే మొదలు పెట్టాడు వరుణ్ తేజ్. ఇదిలా ఉంటే గని విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కూడా పెరుగుతుంది. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. టీజర్, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో.. అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్రిల్ 8న విడుదల కానుంది.
ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో ఎప్రిల్ 2న జరగనుంది. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. సొంత అన్నయ్య నిర్మాత కావడంతో ఈ సినిమాకు బన్నీ కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే బన్నీ కొడుకు అయాన్ కూడా గని ప్రమోషనల్ సాంగ్ చేసాడు. ఇప్పుడు ఈయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Ghani Movie, Telugu Cinema, Tollywood, Varun Tej