Allu Arjun - Bunny Vasu: స్నేహితుడు బన్నీ వాసుకు సర్‌ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్..

అల్లు అర్జున్ బన్నీ వాసు (Allu Arjun Bunny Vasu)

Allu Arjun - Bunny Vas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) త‌న స‌న్నిహితుల్ని ఎంతో అప్యాయంగా చూసుకుంటూ ఉంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో త‌న బెస్ట్ ఫ్రెండ్, ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీ వాసు(Bunny Vasu) పుట్టిన రోజు సంద‌ర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు.

  • Share this:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న స‌న్నిహితుల్ని ఎంతో అప్యాయంగా చూసుకుంటూ ఉంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో త‌న బెస్ట్ ఫ్రెండ్, ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీ వాసు పుట్టిన రోజు సంద‌ర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. ప్ర‌తి ఏడాది ఈరోజున అల్లు అర్జున్, బ‌న్నీవాసుని స్వ‌యంగా క‌లిసి పుట్టిన రోజు శుభ‌కాంక్ష‌లు తెలుపుతుంటారు. కానీ ఈసారి ప‌నిరీత్య బాంబేలో ఉన్నారు బ‌న్నీ వాస్, అయిన‌ప్ప‌టికీ బాంబే వెళ్లి మ‌రీ త‌న బెస్ట్ ఫ్రెండ్ బ‌న్నీవాసుకి బ‌ర్త్ డే విషెస్ తెలిపి.. స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 22 ఏళ్లుగా వీరిద్ద‌రి స్నేహం కొన‌సాగుతోంది. ఆర్య సమయం నుంచే ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ఏకంగా వాసు పేరుకు ముందు బన్నీ అని చేర్చుకున్నాడంటే.. ఈ ఇద్దరి స్నేహం ఏంటో అర్థమవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు త‌న త‌న‌యుడు అయాన్, ప్ర‌ముఖ నిర్మాత‌లు యూవీ క్రియేష‌న్స్ వంశీ, కేధార్‌లు కూడా బ‌న్నీ వాసుని క‌లిసి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఎంతో బిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న కోసం స్వ‌యంగా బాంబే వ‌చ్చి మ‌రి ఈ విధంగా బ‌ర్త్ డే విషెస్ తెలుప‌డంపై నిర్మాత బ‌న్నీవాస్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

త‌న‌తో పాటు తన చుట్టూ ఉన్న‌వాళ్ళు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాల‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకుంటూ ఉంటార‌ని బ‌న్నీవాసు అన్నారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాను నిర్మిస్తున్నారు. దాంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: