• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ICON STAR ALLU ARJUN RESPONDED OVER VIRAT KOHLI PUSHPA RAJ AVATAR TWEETED BY STAR SPORTS DURING IPL 14 PK

Virat Kohli - Allu Arjun: తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్‌కు ఫిదా అయిన పుష్ప..

Virat Kohli - Allu Arjun: తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్‌కు ఫిదా అయిన పుష్ప..

అల్లు అర్జున్ విరాట్ కోహ్లీ (Allu Arjun Virat Kohli)

Virat Kohli - Allu Arjun: అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప(Pushpa) టీజర్ ఈ మధ్యే విడుదలైంది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలోని పుష్ప రాజ్ పోస్టర్‌ను కోహ్లీ(Virat Kohli) టీం వాడుకున్నారు.

  • Share this:
ఇండియాలో సినిమా - క్రికెట్ ఈ రెండింటికీ కోట్లలో అభిమానులు ఉంటారు. వీటిని రెండు మతాలు అని కూడా అంటారు మన దగ్గర. ఇండియాలో రెండే మతాలుంటాయి అనేది క్రికెట్, సినిమా గురించే. ఈ రెండూ యిష్టపడని వాళ్లు మనకు ఎక్కడా కనిపించరు కూడా. అందుకే ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. ఇటు సినిమా వాళ్లు క్రికెటర్స్‌ను.. అటు క్రికెటర్స్ సినిమా వాళ్లను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంటారు. అందుకే ఈ ఇద్దరూ కలిసి యాడ్స్ కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడూ కలిసి సినిమాల్లో కూడా కనిపిస్తుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ చిత్ర పోస్టర్‌లో విరాట్ కోహ్లీ కనిపించాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప టీజర్ ఈ మధ్యే విడుదలైంది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సుకుమార్ హాలీవుడ్ రేంజ్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలోని పుష్ప రాజ్ పోస్టర్‌ను కోహ్లీ టీం వాడుకున్నారు.

తగ్గేదే లే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ రచ్చ లేపుతుంది. బన్నీ ఫ్యాన్స్ అంతా అప్పట్నుంచీ పుష్ప మాదిరే గడ్డం కింద చేతులు పెట్టుకుని తగ్గేదే లే అంటూ డైలాగులు చెప్తున్నారు. ఇప్పుడు పుష్ప పోస్టర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం తమ ప్రమోషన్ కోసం వాడుకుంది.
allu arjun,virat kohli,allu arjun pushpa teaser,virat kohli royal challengers bangalore,virat kohli RCB vs MI,virat kohli as allu arjun in pushpa,allu arjun lifestyle,pushpa allu arjun movie updates,allu arjun pushpa movie crazy look,అల్లు అర్జున్ పుష్ప,విరాట్ కోహ్లీ పుష్ప,పుష్ప పాత్రలో విరాట్ కోహ్లీ
అల్లు అర్జున్ విరాట్ కోహ్లీ (Allu Arjun Virat Kohli)

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ను IPL 14 తొలి మ్యాచ్‌లో ఓడించారు. దాంతో స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్టర్ కోహ్లీ ఫోటోను పుష్ప పోస్టర్‌తో ట్వీట్ చేసింది. ఈ పోస్టర్‌లో పుష్ప రాజ్ ఫోటోను కోహ్లీ మొహంతో మార్ఫింగ్ చేసారు. తగ్గేదే లే... ప్రారంభం అదిరింది అంటూ ట్వీట్ చేసాడు. దీన్ని చూసిన బన్నీ స్మైలీ ఈమోజీల్ని షేర్ చేసాడు. ఈ రెండు పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని పాటలను టిక్ టాక్ చేసి వరల్డ్ ఫేమస్ అయ్యేలా చేసాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఇప్పుడు పుష్ప సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు