Home /News /movies /

ICON STAR ALLU ARJUN PUSHPA MOVIE TEASER CROSSED FASTEST 70 MILLION VIEWS MARK IN TOLLYWOOD HISTORY TA

Pushpa Teaser: అల్లు అర్జున్ ‘పుష్ప’ సరికొత్త రికార్డు.. అత్యంత వేగంగా 70 మిలియన్ వ్యూస్ ..

అల్లు అర్జున్ ‘పుష్ప’ టీజర్ సరికొత్త రికార్డు (Twitter/Photo)

అల్లు అర్జున్ ‘పుష్ప’ టీజర్ సరికొత్త రికార్డు (Twitter/Photo)

Allu Arjun - Pushpa Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. తాజాగా ఈయన యాక్ట్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమా యూట్యూబ్‌లో సంచలనాలు రేపుతూనే ఉంది.

ఇంకా చదవండి ...
    Pushpa Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం  ఈయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బన్ని సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రానికి చెందిన పుష్ప ఇంట్రడక్షన్ వీడియో యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తుంది. విడుదలైన క్షణం నుంచి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వేగంగా 70 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా అల్లు అర్జున్ పుష్ప చరిత్ర సృష్టించింది.

    1.6 మిల్లియన్ లైకులతో పాటు లక్షకు పైగానే కామెంట్స్ కూడా ఈ వీడియోకు రావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో మరే ఇతర సినిమాకు సాధ్యం కాని రికార్డుల్ని అల్లు అర్జున్ తిరగరాశారు. ఈ సంరద్భంగా ఈయన ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ఈ వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను త్వరలోనే ప్రేక్షకులకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.



    తెలుగులో ‘రక్త చరిత్ర’, బాహుబలి,  ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, కేజీఎఫ్ తర్వాత ఒకే సినిమా సీక్వెల్‌ కాకుండా రెండు భాగాలుగా రాబోతుంది. ఈ సినిమాలో బన్ని డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా రెండు భాగాల కోసం అల్లు అర్జున్ దాదాపు రూ. 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. హీరోగా అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా మూవీ. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరి చూడాలి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి మాయ చేస్తాడో.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Bollywood news, Mythri Movie Makers, Pushpa Movie, Sukumar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు