• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ICON STAR ALLU ARJUN PUSHPA MOVIE TEASER CROSSED FASTEST 60 MILLION VIEWS MARK IN TOLLYWOOD HISTORY PK

Pushpa teaser: అల్లు అర్జున్ ‘పుష్ప’ కొత్త రికార్డు.. అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్..

Pushpa teaser: అల్లు అర్జున్ ‘పుష్ప’ కొత్త రికార్డు.. అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్..

అల్లు అర్జున్ పుష్ప సినిమా (Pushpa movie)

Allu Arjun Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు(Allu Arjun) తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈయన నటిస్తున్న పుష్ప(Pushpa) సినిమా మరో రికార్డు సొంతం చేసుకుంది. ఈయన బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ చరిత్ర సృష్టిస్తుంది.

  • Share this:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాలో నటిస్తున్నారు. బబ్లీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సంచలన దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి చెందిన పుష్ప ఇంట్రడక్షన్ వీడియో యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తుంది. విడుదలైన క్షణం నుంచి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా అల్లు అర్జున్ పుష్ప చరిత్ర సృష్టించింది.

1.4 మిల్లియన్ లైకులతో పాటు లక్షకు పైగానే కామెంట్స్ కూడా ఈ వీడియోకు రావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో మరే ఇతర సినిమాకు సాధ్యం కాని రికార్డుల్ని అల్లు అర్జున్ తిరగరాశారు.

ఈ వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను త్వరలోనే ప్రేక్షకులకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.
Published by:Praveen Kumar Vadla
First published: