Pushpa Amazon Prime Streaming | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై నెగిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Pushpa Amazon Prime Streaming | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై నెగిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ మంచి వసూళ్లనే దక్కించుకుంది. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప.
మొత్తంగా హిందీలో రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొన్నిచోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. తాజాగా ఈ సినిమాను మూడు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ. 22 కోట్ల భారీ రేటుకు ఐదు భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా హిందీ వెర్షన్ ఇరగదీస్తుండంతో ఈ సినిమాను తాజాగా 100కు పైగా లొకేషన్స్‌లో నిన్న ఓవర్సీస్లో విడుదల చేసారు. ఇక మన దేశంలో నార్త్ రీజియన్‌లో ఇరగదీస్తోంది. మొత్తంగా హిందీ వెర్షన్ మొత్తం రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది. మొత్తంగా రూ. 300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. అంతేకాదు 2021 లో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ క్రాస్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాహుబలి, 2.O, 'సాహో’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తెరకెక్కింది.
పుష్ప సినిమాకు రూ. 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఏపీలో పలు ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా లాభాల్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతానికి ‘పుష్ప’ సినిమాకు ‘RRR’ , ‘రాధే శ్యామ్’ సినిమాలు పోటీలో లేకపోవడం కలిసొచ్చే అంశం. మరోవైపు హిందీ తప్ప మిగతా భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.