ICON STAR ALLU ARJUN PUSHPA 11 DAYS WW COLLECTIONS STILL LONG WAY TO GO FOR HIT PK
Pushpa 11 days WW Collections: ‘పుష్ప’ 11 డేస్ కలెక్షన్స్.. తెలుగులో మినహా అక్కడ బ్లాక్బస్టర్ కొట్టిన బన్నీ..
పుష్ప 11 డేస్ కలెక్షన్స్ (allu arjun pushpa)
Pushpa 11 days WW Collections: పుష్ప (Pushpa 11 days WW Collections) సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 11 రోజుల్లో ఈ సినిమాకు 133 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి నాలుగు రోజుల వరకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత అల్లు అర్జున్ సినిమాకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప సేఫ్ అవ్వడం ఈజీ కాదు. నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ అయింది. అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. వీక్ డేస్లో పుష్ప చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగులో బాగా పడిపోయాయి కలెక్షన్స్. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో 77.51 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి 11 రోజుల్లో ఈ సినిమాకు ఎంత వచ్చింది.. ఇంకా ఎంత రావాలో చూద్దాం..
పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 11 రోజుల్లో ఈ సినిమాకు 134 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్పకు కోరుకున్న వసూళ్లు రావడం లేదు. ఇక్కడింకా సేఫ్ అవ్వాలంటే కనీసం 26 కోట్లు రావాల్సిందే. ప్రస్తుతానికి సెకండ్ వీకెండ్ ఎలా చేస్తుందనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.