Allu Arjun - Arha: ఒకే లొకేషన్‌లో అల్లు అర్జున్, అర్హ సినిమా షూటింగ్స్.. చిన్నారి భరతుడిని కలిసిన ‘పుష్ప’..

అల్లు అర్హను కలిసిన అల్లు అర్జున్ (Allu Arjun Allu Arha)

Allu Arjun - Arha: గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని(Samantha Akkineni), దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరుగుతుంది.

  • Share this:
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. చిన్నారి భరతుడి పాత్రలో ఈమె కనిపిస్తుంది. ఈ మధ్యే తన కూతురు నటన చూడటానికి కుటుంబ సమేతంగా శాకుంతలం సెట్‌కు వచ్చి సర్‌ప్రైజ్ చేసారు అల్లు అర్జున్. తాజాగా మరోసారి అదే జరిగింది. అయితే ఈ సారి సెట్‌కు రావడం కాదు.. అటు అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్.. ఇటు అల్లు అర్హ నటిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ ఒకే లొకేషన్‌లో జరుగుతున్నాయి.

ఈ రెండు సినిమాల షూటింగ్ సారథి స్టూడియోస్‌లోనే జరుగుతుండటంతో.. పక్కనే ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్లారు అల్లు అర్జున్. పుష్ప వచ్చి భరతుడిని కలిసారు. తన కూతురు నటిస్తున్న సినిమా.. తన సినిమా షూటింగ్ ఒకే చోట జరుగుతుండటంతో ఎగ్జైట్ అయిపోయారు అల్లు అర్జున్.
allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun movies,allu arjun allu arha,allu arjun met allu arha,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్హను కలిసిన అల్లు అర్జున్,శాకుంతలం సినిమా షూటింగ్
‘శాకుంతలం’ సెట్‌ను విజిట్ చేసిన అల్లు అర్జున్ (Twitter/Photo)

తన జీవితంలో ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు ఐకాన్ స్టార్. తన కూతురు అర్హను ఇలా సెట్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉందంటూ ఎత్తుకుని ముద్దాడారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: